తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనుంగ అనుచరుడు ఓ పన్నీర్‌సెల్వం తనది ఎంత ఉడుం పట్టో మరోమారు నిరూపించుకున్నారు. చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా సొంత కుంపటి ఏర్పాటు చేసి సీఎం అయ్యేందుకు శతవిధాల ప్రయత్నించిన సెల్వం ఆ ప్రయత్నం విఫలం అయినప్పటికీ తన పోరాట పంథాతో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన నేతృత్వంలోని అన్నాడిఎంకె తిరుగుబాటు వర్గం ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ బోర్డుకు వ్యతిరేకంగా పోటీ బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు దీనిలో భాగమయ్యే 13 మంది సభ్యుల పేర్లను సైతం ప్రకటించి సంచలనం సృష్టించింది.
దివంగత జయలలిత స్థానంలో వీకే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కొద్ది రోజుల క్రితం అన్నాడిఎంకె పార్లమెంటు బోర్డును పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు అన్నాడీఎంకే ఎంపీలు సెల్వంకు జై కొట్టారు. దీంతో లోక్ సభ-రాజ్యసభల్లో తనకున్న బలాన్ని చాటుకునేందుకు పోటీ పార్లమెంటరీ బోర్డుకు శ్రీకారం చుట్టారు. తిరుగుబాటు వర్గం ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఈ పరిణామంపై స్పందిస్తూ పార్టీ నిబంధనల ప్రకారం పార్లమెంటు బోర్డుకు సభ్యులను నియమించే అధికారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఉంటుందని అంటూ శశికళ నేతృత్వంలోని బోర్డు చెల్లదని వాదించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/