దెబ్బ తీయాలన్న ఆలోచన రాకూడదు. ఒక్కసారి వచ్చిందా? అంతకంతకూ ఏదో ఒక ప్రయత్నంజరుగుతూనే ఉంటుంది. ఎత్తులు.. పైఎత్తులు మామూలే. తమిళనాడు అధికారపక్షంలో శశికళకు.. పన్నీర్ కు మధ్య నడుస్తున్న వార్ కూడా ఇదే రీతిలో ఉంది. అమ్మ తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన చిన్నమ్మకు సైతం కొంతకాలం విధేయుడిగా ఉన్న పన్నీర్.. తర్వాత తిరుగుబాటు బావుటా ఎగురవేయటం.. అనంతర పరిణామాలు తెలిసిందే.
పన్నీర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సీఎం కుర్చీని కాపాడుకోలేకపోయారు. దీంతో.. రగిలిపోతున్న ఆయన.. శశికళ వర్గానికి చుక్కలుచూపించే ప్రయత్నం షురూ చేశారు. పళనిస్వామి నియమకానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఆయన.. అమ్మపార్టీని శశికళ కటుంబం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయనగళం విప్పుతున్నారు. ఇప్పటికే తనకు పది మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నఆయన.. బలపరీక్ష సమయానికి మరింతమందిని కూడగట్టుకుంటానని చెబుతుండటం విశేషం.
చిన్నమ్మకు వ్యతిరేకంగా పావులు కదపటంతో పాటు.. ప్రజలుకోరుకున్నరీతిలో ఓట్లు వేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ పిలుపునిస్తున్నారు. అమ్మ మరణానికి కారణం జయలలిత కుటుంబమేనని ఆరోపిస్తున్న ఆయన.. గతంతో పోలిస్తే.. విమర్శల తీవ్రతను మరింత పెంచడటం గమనార్హం. ఇక.. అమ్మకు ఆయువుపట్టులాంటి వేదనిలయం నుంచి శశికళ కుటుంబీకుల్ని బయటకు తీసుకురావాలన్న ఆకాంక్షను మరోసారి బయటపెట్టారు. వేదనిలయంలో శశికళ కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదన్న ఆయన.. వేద నిలయాన్నిస్మారకంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. పన్నీర్ మొదలెట్టిన ఈ వార్ కు ప్రజల నుంచి ఎంత సపోర్ట్ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/