చెన్నైకు నీళ్లిచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. నీటి లభ్యత, స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని చెన్నైకి నీటి సరఫరా విషయమై తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. తిరుపతిలో త్వరలో ఉన్నతాధికారుల స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి బకాయిలు, తమిళనాడులోని పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు, ఎర్రచందనం స్మగ్లింగ్ అంశాలను భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. వేసవికి ముందే చెన్నైలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఈ నగర దాహార్తి తీర్చేందుకు దాదాపు 11.5 టిఎంసిల నీరు అవసరం. నగర నీటి అవసరాలను తీర్చే 8 రిజర్వాయర్లు దాదాపు ఎండిపోగా, ప్రస్తుతం 1.5 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో చెన్నైకు నీరు సరఫరా చేయాలని కోరేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజయవాడ వచ్చారు.
వెలగపూడి సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు గంట సేపు సమావేశమై నీటి సమస్యపై చర్చించారు. తమిళనాడు నుంచి 12 మంది ఉన్నతాధికారుల బృందం సెల్వం వెంట రాగా, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ చెన్నైకి నీటి సరఫరా విషయమై హేతుబద్ధంగా ఆలోచించాలన్నారు. మంచినీటికి సంబంధించిన అంశం కనుక మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీరు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక తమ వాటాగా అందులో దాదాపు రెండున్నర టిఎంసిలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కృష్టా రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కావడంతో ఈవిషయంలో బోర్డు జోక్యం కూడా అవసరమనే అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేశారు. ఈ ఏడాది 26 శాతం మేర వర్షపాతం తక్కువ నమోదైందని వివరించారు. అరకొరగా జలాలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కండలేరు, సోమశిల ప్రాజెక్టుల్లో నీరు తక్కువగా ఉందని, పంటల పరిస్థితులను గమనించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఒక టిఎంసి విడుదల చేశామని గుర్తుచేశారు. త్వరలో తిరుపతిలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామన్నారు. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంతో కొన్ని ప్రాంతాలను నీటి సమస్య నుంచి గట్టెక్కించగలిగామని చంద్రబాబు వివరించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు దాదాపు 434 కోట్ల రూపాయల మేరకు బకాయిలు 10 సంవత్సరాలుగా చెల్లించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.
పన్నీర్ సెల్వం స్పందిస్తూ తమ ప్రభుత్వ లెక్కల ప్రకారం అంత మొత్తం బకాయి లేదనగా, ఈ మొత్తం బకాయి ఉన్నట్లు ‘కాగ్’ నివేదిక కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. బకాయి మొత్తం తేలితే చెల్లించేందుకు తాము సిద్ధమని సెల్వం తెలిపారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తమిళనాడుకు చెందిన కూలీలు ఎక్కువగా పాల్పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని స్మగ్లింగ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తమిళనాడు పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పన్నీర్ సెల్వం బదులిచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్ చేసిన సాయం మర్చిపోలేమని, ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి సాధిద్దామని ఆకాంక్షించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/