తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మొదట్లో జయలలిత నెచ్చెలి శశికళ కనుసన్నల్లోనే నడుచుకునేలా కనిపించినా తాజాగా రూటు మారుస్తున్నారు. తనను దించేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకునేందుకు శశికళ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా గుర్తించిన ఆయన రూటు మార్చి పెద్దల అండతో పదవి కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన ప్రధాని మోడీని కలిశారని.. మోడీని కలిసొచ్చిన తరువాత పన్నీర్ నోట శశికళ అన్న పదమే వినిపించడం లేదని... ఎవరైనా ఆయన వద్ద ఆమె ప్రస్తావన తెస్తే.. కనుబొమ్మలు ముడిపెట్టి ఆమె ఎవరు అన్నట్లు చూస్తున్నారని అన్నా డీఎంకే వర్గాల్లో టాక్. తాజా పరిణామాలతో తమిళ పాలిటిక్సు వేడెక్కనున్నట్లు చెబుతున్నారు.
నిజానికి జయ మరణం తరువాత పన్నీర్ సెల్వం కూడా శశికళ మాటే విన్నట్లు కనిపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటూ ఆయన కూడా శశికళ వద్దకు వెళ్లి కోరారు. దీంతో ఆయన శశికళ ఆడించినట్లే ఆడుతారని అంతా భావించారు. పార్టీలోని మిగతా నేతలూ చిన్నమ్మ వద్ద క్యూ కట్టారు. కొందరు మంత్రులు - సీనియర్ నేతలు ఏకంగా శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలన్న కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.. దీంతో పన్నీర్ జాగ్రత్త పడుతున్నారు. జయకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తో ప్రధానిని కలిశారు. భారతరత్న కారణంగా చూపుతునత్నా అసలు కారణం రాజకీయ చర్చేనని తెలుస్తోంది.
ప్రధానిని కలిసిన తరువాత బయటకు వచ్చిన ఆయన్ను మీడియా చుట్టుముట్టి, శశికళా నటరాజన్ గురించి ప్రశ్నించగా, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో తమిళరాజకీయాలు మలుపు తిరుగుతున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/