పన్నీర్ బయటపెట్టిన చిన్నమ్మ లేఖ?

Update: 2017-02-09 06:07 GMT
తమిళనాడు రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో తెలిసిందే. మొదట అమ్మకు.. తర్వాత చిన్నమ్మకు తన విధేయతను ప్రదర్శించిన పన్నీర్ సెల్వం.. అనూహ్యంగా చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇరువురి మధ్య ఎత్తులు పైఎత్తులు సాగుతున్న వేళ.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా పన్నీర్ సెల్వం విడుదల చేసిన ఒక లేఖ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

అమ్మ బతికున్నరోజుల్లో శశికళను.. ఆమె బంధువులను పోయెస్ గార్డెన్ నుంచి బయటకు గెంటివేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో అమ్మకు శశికళ రాసిన లేఖను తాజాగా పన్నీర్ విడుదల చేశారు. ఈ లేఖలో.. తనను క్షమించాలంటూ జయలలితను శశి కోరటంతోపాటు.. తనకు అధికారం మీద ఎలాంటి ఆశలు లేవన్న మాటను చెప్పటం గమనార్హం.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2012లో అమ్మకు శశికళ రాసిన ఈ లేఖను  పన్నీర్ విడుదల చేశారు. ఇక లేఖలోని సారాంశం చూస్తే.. ‘‘మా బంధువులు.. మిత్రులు కొంతమంది నేను పోయెస్ గార్డెన్ లో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకొని అక్రమాలకు పాల్పడ్డారు. మీకు (జయలలిత) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలీకుండానే జరిగాయి. కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టను. నా బంధవులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇది క్షమించరానిది. నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలని కానీ.. పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడు కోరలేదు. అసలు ప్రజా జీవితంలోకిప్రవేశించాలన్న ఆశ నాకెప్పటికీ రాలేదు. నా జీవితాన్ని మీ కోసమే అర్పించాను. నన్ను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోండి’’ అని ఉండటం గమనార్హం.

లేఖలో పేర్కొన్న అంశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు తాజాగా ఉండటం ఒకఎత్తు అయితే.. అధికారం మీదా.. రాజకీయాల మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పుకున్నశశి..ఈ రోజు అందుకు విరుద్ధంగా సీఎం అయ్యేందుకు ఆమె తపిస్తున్న తీరుతో ఆమె మైండ్ సెట్ ఎలాంటిదో ప్రజలకు అర్థం చేసేలా తాజా లేఖ ఉందని చెప్పొచ్చు. ఇక.. ఇప్పటికే పలు ఆరోపణలున్న శశికళ బంధువర్గం తీరు ఎలాంటిదో శశి రాసిన లేఖే నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ లేఖతోపాటు.. పన్నీర్ మరింత ఆసక్తికరమైన మాట ఒకటి చెప్పారు. తనకు తెలిసిన విషయాల్లో పది శాతమే బయటపెట్టానని.. ఇంకా 90 శాతం తనలోనే ఉన్నాయని చెప్పటం చూస్తే..రానున్న రోజుల్లో చిన్నమ్మ మీద మరిన్ని అంశాలు బయటకు రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News