తలైవా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమయిందా? ఆయన రాజకీయ అరంగేట్రం సొంత పార్టీ రూపంలోనే ఉంటున్నప్పటికీ దాని వెనుక బీజేపీ ఉండనుందా? రజనీ పార్టీ ఏర్పాటుతో తమిళ పార్టీలకు షాక్ ఖాయమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆంగ్ల మీడియా కథనం ప్రకారం రజనీ సొంత పార్టీ పెట్టనున్నారు. ఆయన్ను తమ పార్టీలోకి లాగాలని చూసిన బీజేపీకి అది వర్కవుట్ కాకపోవడంతో...తలైవా సొంత పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రజనీ పార్టీ కోసం పనిచేస్తోందని సమాచారం.
2019 ఎన్నికల్లో రజనీ తన పార్టీ తరఫున కీలక నిర్ణయం తీసుకుంటారని ఆంగ్ల మీడియా కథనాలు రాస్తోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో రానున్న రజనీ పార్టీ సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి ఎన్నికల బరిలోకి దిగుతుందని పేర్కొంది. అయితే ఆ సమయంలో బీజేపీతో కలిసి రజనీ పార్టీ రంగంలోకి దిగుతుందని విశ్లేషించింది. ఇదిలాఉండగా తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సైతం రజనీ చెక్ పెడుతారని అంటున్నారు.
తమిళ రాజకీయాల్లో బలోపేతం అయేందుకు ఎన్నో వ్యూహాలు పన్నినప్పటికీ ఫలితం ఇవ్వకపోవడంతో అమ్మ మరణం తర్వాత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ సిద్ధమైందని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ సీఎం పన్నీర్ సెల్వంను తమ దారికి తెచ్చుకున్న బీజేపీ చిన్నమ్మ శశికళ వర్గంపై గురిపెట్టింది. ఆమెను టార్గెట్ చేయడంలో భాగంగా రజనీ సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని నిజం చేస్తుందన్నట్లుగా రజనీ పార్టీ పెడితే జంప్ చేసేందుకు ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయినట్లు ఆంగ్ల మీడియా జోస్యం చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/