తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మొత్తం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగుతోంది. రాజకీయం కోసం ఇరువురు నేతలు నేరచరిత్రను అభాసుపాలు చేసుకుంటున్నారు. బీజేపీ కవితను టార్గెట్ గా విమర్శలు చేస్తుండగా.. బీఆర్ఎస్ ఫాంహౌస్ కేసును ఎత్తి చూపింది. అయితే ఈ యుద్ధం ఇక్కడితోనే ముగిసిపోలేదు. మరిన్ని విషయాలకు, కేసులకు పాకుతోంది.
తెలంగాణలో ఏ నేరం జరిగినా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై నెపం వేసేస్తున్నారు. దానిలోని నిందితులను బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ వారంటే మీవాళ్లు అని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరో కింది స్థాయి నేతలు మాత్రమే కాదు.. ఇప్పుడు తెలంగాణలో రెండు పార్టీల అగ్రనేతలు ఇలానే అంటుండడం విశేషంగా మారింది.
తెలంగాణలో పేపర్ లీకేజీ రాజకీయం నడుస్తోంది. ఈ రాజకీయంలోకి బీజేపీ, బీఆర్ఎస్ చేరిపోయాయి. ఈ కేసు బయటపడగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
తాజాగా టీఎస్.పీఎస్సీ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ పార్టీ కార్యకర్త అని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ విషయంలో తగిన దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ను ట్విట్టర్ ద్వారా కోరారు.
కేటీఆర్ ఇలా ట్వీట్ చేశారో లేదో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అందుకున్నారు. ఈ కేసులో ఏ3గా నిందితురాలిగా ఉన్న రేణుకా రాథోడ్ తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కూతురు అని మీడియాలో వచ్చిన వార్తను పోస్ట్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇలా రెండు పార్టీల అగ్రనేతలు టీఎస్.పీఎస్ సీ కేసు విషయంలో పరస్పర ఆరోపణలతో కేసుల ఉచ్చులో ఇరు పార్టీల వారిని లాగి మరీ రచ్చ చేస్తూ వారి పరువును వారే పొగోట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు, పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.