రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆయన ఒకప్పటి సహచరుడు, జన్ అధికార పార్టీ అధినేత పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ అసలు యాదవ్ కాదని... ఆయన నకిలీ యాదవ్ అని అంటూ తానే నిజయమైన యాదవుడినని పప్పూ ప్రకటించుకున్నారు. బీహార్ రాజకీయాల్లో అత్యంత నేర చరితుడిగా పేరున్న పప్పూ ఒకప్పుడు ఆర్జేడీలోనే ఉండేవారు. అప్పట్లో ఆయన లాలూ కు అత్యంత సన్నిహితుడు కూడా. అయితే, ఆ తరువాత లాలూతో విభేదించిన ఆయన ఆర్జేడీ నుంచి బయటకొచ్చి జన అధికార్ పార్టీ పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
మాధేపురా ఎంపీగా ఉన్న పప్పూ యాదవ్ యాదవులు ఎక్కువగా ఉండే సీమాంచల్ లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయిదో విడతలో అక్కడ పోలింగ్ జరగబోతోంది. దీంతో పప్పూ ఆలోగా తన బలాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే యాదవులకు తానే నిజమైన ప్రతినిధిని అని చెప్పుకునేలా లాలూని తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
లాలూ తన చుట్టూ భజనపరులను పెట్టుకుంటారని.. ఒకప్పుడు ఆయన్ను నాయకుడిని చేసిన యాదవులను ఆయన పూర్తిగా మరిచిపోయారని ఆరోపించిన పప్పూ లాలూపై మరిన్ని విమర్శలూ చేశారు. యాదవులను లాలూ ఓట్లలా చూస్తున్నారని... కానీ, తాను మాత్రం యాదవుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కాగా ప్రచారంలో దూసుకెళ్తున్న పప్పూ ఫలితాలు ఎంతవరకు సాధిస్తారు... ఫలితాలు వచ్చాక ఆయన స్టాండ్ ఏమిటన్నదీ సందేహమే.