సంచలన వ్యాఖ్యలకు.. వివాదాస్పద వైఖరికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు ఎంపీ పప్పు యాదవ్. జన అధికార్ పార్టీ ఎంపీ అయిన అసలు పేరు రాజేశ్ రంజన్. కానీ.. పప్పు యాదవ్‌గా సుపరిచితులు. తాజాగా మావోయిస్టులు భద్రతా దళాల్ని మట్టుపెట్టిన వైనంపై స్పందించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టులు కావాలంటే రాజకీయ నాయకుల్ని చంపాలే కానీ భద్రతా దళాల సిబ్బందిని మాత్రం ఏం చేయొద్దని కోరారు. రాజకీయ నేతలు దేశాన్ని దోచేస్తుంటారు.. భద్రతా దళాలు దేశానికి రక్షణగా నిలుస్తుంటారు. అందుకని మావోలు నేతల్ని చంపాలే కానీ భద్రతా సిబ్బందిని కాదన్నారు. గతంలో రాష్ట్రీయ జనతాదళ్లో ఉండి.. తర్వాత బహిష్కరణకు గురైన పప్పు యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో తీవ్రవాదం తగ్గిపోతుందని ప్రధాని మోడీ చెప్పారని.. మరి పెద్దనోట్లను రద్దు చేసి ఇంతకాలం అయ్యాక కూడా మావోల దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి? అంటూ సూటిగా ప్రశ్నించారు.
మొన్నటివరకూ జైలులో ఉన్న ఆయన ఇటీవల విడుదలయ్యారు. ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయటం పప్పుయాదవ్ కు అలవాటే. గతంలో కూడా అవినీతి పరులైన రాజకీయ నేతల్ని.. అధికారుల్ని ఎవరైనా కొట్టి చంపితే రూ.10లక్షల నజరానా ఇస్తానని ప్రకటించటం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు.. అవినీతిపరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసి.. ఆధారాలు సంపాదిస్తే రూ.25వేల నజరానా ఇస్తానని చెప్పటం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా.. భద్రతా సిబ్బందిని వదిలేసి.. రాజకీయనాయకుల్ని చంపేయాలంటూ మావోలకు చేసిన సూచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/