భారత పారా అథ్లెట్లకు విదేశాల్లోనే కాదు - స్వదేశంలో కూడా అవమానాలు తప్పడం లేదు. బెర్లిన్ లో పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పాల్గొంటున్న కంచన్ మాలా పాండే బిచ్చమెత్తిన ఘటన మరువక ముందే మరో అథ్లెట్ కు అవమానం జరిగింది. పారా అథ్లెట్ సువర్ణా రాజ్ కు ఢిల్లీ విమానాశ్రయంలో అవమానం జరిగింది. ఆమె కూర్చున్న చక్రాల కుర్చీకి స్కానింగ్ చేసే సమయం లేదంటూ ఆమె ప్రయాణాన్ని ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు.
ఉదయ్ పూర్ వెళ్లేందుకు సువర్ణ మంగళవారం మధ్యాహ్నం 12.45గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం 1.25 గంటలకు బయల్దేరాల్సి ఉంది. ఆమె చక్రాల కుర్చీని స్కాన్ చేసేందుకు టైం లేదని ఇండిగో విమాన సిబ్బంది సువర్ణ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. ఆమె విజ్ఞప్తిని సిబ్బంది పట్టించుకోలేదు. విదేశాల్లో ఇటువంటి ఘటనలను ఎదుర్కోలేదని, స్వదేశంలో అవమానాలు పడవలసి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సువర్ణ విమానాశ్రయానికి ఆలస్యంగా రావడం వల్లే విమానాన్ని మిస్ అయ్యారని ఇండిగో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అజయ్ జాస్ తెలిపారు. ఆమె పారా అథ్లెట్ కావడంతో ఉచితంగా ఆమెను మరో విమానంలో పంపించామని, దీనికి ఆమె సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు.
గతంలో నాగ్‌పూర్-నిజాముద్దీన్ గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో సువర్ణకు అప్పర్ బెర్త్ ను కేటాయించారు. తనకు లోయర్ బెర్త్ ఇవ్వాలని టీటీఈని - ఇతర ప్రయాణికులను కోరినా ఫలితం లేకపోవడంతో ఆమె రైలులో కింద పడుకొని ప్రయాణించాల్సి వచ్చింది. సువర్ణా రాజ్ 2013లో థాయ్ లాండ్ పారా టేబుల్ టెన్నిస్ ఓపెన్ లో రెండు పతకాలను సాధించారు. అదే ఏడాది నేషనల్ వుమెన్ ఎక్సలెన్స్ అవార్డును కూడా దక్కించుకున్నారు..