అమెరికాలో పారాచూట్ ప్రమాదం.. ఏపీ మహిళ మృతి

Update: 2022-06-01 06:30 GMT
విహారయాత్ర ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. ఏపీకి చెందిన ఓ మహిళ అమెరికాలో మరణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మరణించింది. సుప్రజ కుమారుడు అఖిల్ కు స్వల్పగాయాలయ్యాయి.

భారత కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్యారాచూట్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఫ్లోరిడాలో వేసవి సెలవులకు తెలుగు కుటుంబం వెళ్లింది. ఈ క్రమంలోనే పారాచూట్ పై ఫ్లైయింగ్ చేస్తుండగా పడిపోయి మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

సుప్రజ అలపర్తి తన కుటుంబం.. స్నేహితులతో కలిసి ఫ్లోరిడాలో విహారయాత్రకు వెళ్లారు. సుప్రజ మరియు ఆమె కుమారుడు అక్షిత్ ఫ్లోరిడా బీచ్‌లో పారాచూట్‌పై విహరించడానికి రెడీ అయ్యారు. అయితే  పారాచూట్ ప్రమాదవశాత్తు వంతెనను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.

సుప్రజ, ఆమె భర్త అలపర్తి శ్రీనివాసరావు దంపతులకు అక్షిత, అధిర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం చికాగోలో ఉంది. వారు ఇటీవల ఫ్లోరిడాకు వెళ్లారు.

సుప్రజ తండ్రి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తెల్లా శ్రీనివాసరావు. ఆమె స్వస్థలం బాపట్ల జిల్లా సంతముగులూరు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనతో బాపట్ల జిల్లా మక్కేనవారి పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags:    

Similar News