పట్టిసీమ విషయంలో ఏపీ అధికార.. విపక్షం రెండూ పట్టువిడుపులు లేకుండా చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా..ఏడాది వ్యవధిలో పట్టిసీమను పూర్తి చేసి తన సత్తా ఏమిటో చాటుతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతుంటే.. ఎలా కడతారో చూస్తానంటూ..పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేస్తున్నారు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
పట్టిసీమ కారణంగా నష్టమే తప్పించి లాభమే లేదంటూ వాదిస్తున్న జగన్‌కు కౌంటర్ గా.. సీమ బాగుపడటం ఇష్టం లేదంటూ ఏపీ అధికారపక్షం విరుచుకుపడుతుంది. మొత్తంగా పట్టిసీమ ప్రాజెక్టుపై ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా పట్టిసీమ ఉదంతంపై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు గురించి అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పట్టిసీమ ప్రాజెక్టును విమర్శించే ముందు జీవో 200 చదవాలని జగన్ కు సూచించారు.
కరువు బృందాన్ని కలిసి ఏపీ రాష్ట్ర సమస్యల్ని వివరించేందుకు సమయం లేని జగన్.. పట్టిసీమను అడ్డుకునేందుకు ప్రధానిని మాత్రం కలిశారంటూ మండిపడ్డారు. పట్టిసీమను ఎంత ఆపాలని ప్రయత్నించినా.. ఏడాది లోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పాయింట్ ను వివరిస్తున్న జగన్.. పరకాల వారి సూచనపై ఎలా రియాక్ట్ అవుతారో మరి.