చైత‌న్య యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించిన పేరెంట్స్ అరెస్ట్‌?

Update: 2017-10-11 17:42 GMT
ప్ర‌శ్నించ‌ట‌మే త‌ప్పు అవుతుందా? అన్న‌ది ఇప్పుడు త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌. ఒక‌వైపు ఒక కులాన్ని త‌న‌కు తోచిన‌ట్లుగా రాసేసిన పుస్త‌కంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టుకు ఎక్కితే.. అలా చేస్తే భావ‌స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ట్లుగా అత్యున్న‌త న్యాయ‌స్థానం చెబుతోంది.

మ‌రోవైపు.. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. త‌మకు జ‌రుగుతున్న అన్యాయం గురించి గ‌ళం విప్పి రోడ్డు ఎక్కినా.. నిర‌స‌న చేసినా అరెస్ట్ లు చేయ‌టం క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తున్న ఈ తీరు ఇప్పుడు కొత్త అయోమ‌యానికి కార‌ణంగా మారుతుంద‌ని చెప్పాలి.

తాజాగా నిడ‌మానూరు చైత‌న్య కాలేజీ యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించిన ఓ స్టూడెంట్ పేరెంట్స్‌ ను ప‌ట‌మ‌ట పోలీసులు అరెస్ట్ చేశారు. బ‌ల‌వంతంగా పోలీస్ జీపులోకి లాక్కెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. పోలీసుల తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. త‌మ బిడ్డ చ‌దువుకుంటున్న యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించ‌ట‌మే పాప‌మ‌న్న‌ట్లుగా పోలీసులు వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఇటీవ‌ల కాలంలో కొన్ని అంశాల మీద ప్ర‌శ్నిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసులు ఎంట్రీ ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. తాజా ఉదంతంలోనూ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. శ్రీచైత‌న్య యాజ‌మాన్యానికి పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ట్లుగా వారి తీరు ఉంద‌ని విద్యార్థి పేరెంట్స్ మండిప‌డుతున్నారు. ఇలాంటివి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరుతో పాటు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న మాట‌కు విరుద్ధంగా ఉంటాయ‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు అండ్ కో గుర్తిస్తే మంచిది. లేకుండా ప్ర‌జాగ్ర‌హం త‌ప్ప‌దు.
Tags:    

Similar News