ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ న్యూ ఇయర్ కు ముందుగానే ఆ దేశంలోని యువతకు బిగ్ సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఫ్రాన్స్ లోని 25 ఏళ్ళ లోపు యువతీ యువకులకు ఫార్మసీ సంస్థలు ఫ్రీగా కండోమ్స్ ఇవ్వాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సంచలన నిర్ణయం వెనుక ప్రభుత్వానికి మరో ఉద్దేశం ఉందని స్పష్టమవుతోంది.
ఫ్రాన్స్ లో గతేడాది లైంగికంగా సంక్రమించే వ్యాధుల రేటు గతంలో కంటే 30 శాతం అధికంగా నమోదైందని సర్వేలో వెల్లడైంది. ఈ క్రమంలోనే 2022 సంవత్సరం ప్రారంభం నుంచి 18 నుంచి 25 లోపు మధ్య మహిళల్లో గర్భ నిరోధక మాత్రలు.. గర్భనిరోధక లూప్ లు.. గర్భనిరోధక ప్యాచ్ లు.. ఇతర దీర్ఘకాలిక గర్భ నిరోధక మాత్రలను ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది.
అయితే 18 ఏళ్ల లోపు వారంతా ఆర్థిక ఇబ్బందుల కారణంగా గర్భ నిరోధకానికి వదులుకోకుండా నిరోధించడానికి గాను ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఎయిడ్స్ వంటి లైంగిక వ్యాధులను సైతం ఎదుర్కోవడానికి వైద్యుల సూచనల మేరకు కండోమ్స్ విక్రయాలు ఇప్పటికే జరుగుతున్నాయని జాతీయ ఆరోగ్య సంరక్షణ కమిటీ పేర్కొంది.
ఫ్రాన్స్ లో లైంగికంగా సంక్రమించే వ్యాధులు పూర్తిగా నివారించడంలో భాగంగా కొత్త ఏడాది నుంచి కండోమ్స్ ఫ్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్యాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 1 నుంచి 25 ఏళ్ళ లోపు వారందరికీ ఉచితంగా కండోమ్స్ ఇవ్వాలని ఫార్మసీలకు ఆదేశాలు జారీ చేశారు.
దీని వల్ల యువత ఆరోగ్యకరమైన లైంగిక చర్యల్లో పాల్గొంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవాంఛిత గర్భధారణ.. లైంగికంగా సంక్రమించే రోగాలను పూర్తి స్థాయిలో నిరోధించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఫ్యాన్స్ లో పెరిగి పోతున్న అవాంఛిత గర్భాలను కూడా తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యాన్స్ అధ్యక్షుడి నిర్ణయంపై వైద్యులు సైతం సంతృప్తిని వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.