పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వైనం తెలిసిందే. చిత్తూరు మొదలు కొని.. శ్రీకాకుళం వరకు అధికార వైసీపీ దూకుడు కొనసాగిందని.. విపక్షం ఎక్కడా కనిపించలేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఫ్యాన్ గాలికి.. టీడీపీ.. టీ గ్లాస్.. కమలంపువ్వు అడ్రస్ లేకుండా పోయాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గణాంకాల్ని చూసినప్పుడు ఆ వాదనలోనూ నిజం ఉందన్న భావన కలుగక మానదు. అయితే.. పరిషత్ ఎన్నికల్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించిందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు.
అయితే.. నామినేషన్ల నాటికే పావుశాతం సీట్లలో అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసేసుకోవటం.. అధికారంతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో.. ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పటం మర్చిపోకూడదు. అయితే.. బాబు తన నిర్ణయాన్ని ప్రకటించే నాటికే కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయటం..పార్టీ అధినేత అభీష్టానికి భిన్నంగా పోటీలో కంటిన్యూ కావాలని డిసైడ్ చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అధికారపార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితాల్ని.. ప్రజాభిప్రాయంగా తీసుకోవటం సరికాదన్న మాట వినిపిస్తోంది. అయితే.. తమ గెలుపును తక్కువ చేసి చూపించేందుకే టీడీపీ నేతలు ఈ తరహా నాటకాలు ఆడుతున్నారని వైసీపీ మండిపడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఫలితాలు ఒకలా.. తూర్పు గోదావరి జిల్లాలో ఫలితం మరోలా ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ జిల్లాలో ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ.. జనసేన పార్టీలు గట్టి పోటీని ఇవ్వటం గమనార్హం.
అధికారికంగా ఎన్నికల్ని బహిష్కరించినట్లు చెప్పినప్పటికీ.. స్థానిక సమీకరణాల నేపథ్యంలో కొందరు టీడీపీ అభ్యర్థులు తమకు తాముగా బరిలో నిలిచారు. పోటీ మీద పెద్దగా ఫోకస్ చేయకున్నా.. ఫలితాలు మాత్రం మిగిలిన జిల్లాలతో పోలిస్తే మెరుగ్గా ఉండటం గమనార్హం. టీడీపీ వరకు చూస్తే.. మొత్తం ఎంపీటీసీల్లో 11 శాతం సీట్లను సొంతం చేసుకోగా.. జనసేన తొమ్మిది శాతం సీట్లను గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు సైతం తమ బలాన్ని నిరూపించుకుంటూ 19 సీట్లను గెలుచుకున్నారు. మిగిలినస్థానాల్లో సీపీఎం.. బీఎస్పీ.. ఐఎన్సీలు ఒక్కో సీటు గెలుచుకోగా.. సీపీఎం ఎప్పటిలానే ఏడు స్థానాల్ని.. బీజేపీ రెండు స్థానాల్ని గెలుచుకున్నాయి. మొత్తంగా మిగిలిన జిల్లాలకు భిన్నమైన సీన్.. తూ.గో.లో ఉందని చెప్పక తప్పదు.