ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించి సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ... ఎన్నికల విధుల్లోని అధికారులపై విపక్షాలకు చెందిన నేతలు తమదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్న వైనం చూస్తున్నదే. ఆ కోవలో ఇంకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ అమలు పక్కాగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్నికల అధికారులపై టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ దౌర్జన్యానికి దిగారు. ఏకంగా ఓ ఎన్నికల అధికారి కాలర్ పట్టుకున్న పరిటాల శ్రీరామ్... అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు.
ఈ ఘటన ఆదివారం పరిటాల సొంత మండలం రామగిరిలో చోటుచేసుకుంది. రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని శ్రీరామ్ బెదిరింపులకు దిగారు.
టీడీపీ అధికారంలో ఉండగా... తన ఆగడాలకు అడ్డే లేదన్నట్లుగా వ్యవహరించిన పరిటాల శ్రీరామ్... తన పార్టీ విపక్షంలోకి మారినా కూడా తన వైఖరి మారలేదన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు కరోనా ఎఫెక్ట్ తో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత... కోడ్ అమల్లో ఉంటుందని, దానిని పక్కాగా అమలు చేసేందుకే విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై పరిటాల శ్రీరామ్ ఇలా కాలర్ పట్టుకుని మరీ దౌర్జన్యానికి దిగడం నిజంగానే సంచలనంగా మారిపోయింది.