ప‌రిటాల శ్రీ‌రామ్ తీసుకెళ్లి కొట్టాడు!

Update: 2018-02-14 08:47 GMT
ఏపీ మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు.. టీడీపీ నేత ప‌రిటాల శ్రీ‌రామ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోయ సూర్యం. అనంత‌పురం జిల్లా ఎస్పీకి త‌న ఫిర్యాదును రిజిష్ట‌ర్ పోస్టులో పంపిన అనంత‌రం ఒక మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌రిటాల శ్రీ‌రామ్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ నెల 7న త‌మ పార్టీ నేత తోపుదుర్తి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో క‌లిసి తాను.. రామ లింగారెడ్డిలు క‌లిసి పేరూరులో ప‌ర్య‌టించామ‌న్నారు. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి కుమారుడు శ్రీ‌రాం.. మాదాపురం శంక‌ర్‌.. కొత్త‌ప‌ల్లి శివ‌కుమార్  త‌దిత‌రులు త‌మ ఇంటికి మార‌ణాయుధాల‌తో వ‌చ్చి త‌న‌ను బెదిరించి తీసుకెళ్లార‌న్నారు.

త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌టంతో పాటు.. అన‌రాని మాట‌ల‌న్నార‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి తిరిగితే చంపేస్తామ‌ని తిట్ట‌టంతో పాటు.. త‌న‌పై దాడి చేశార‌న్నారు. ఈ దాడి ఫ‌లితంగా త‌న చేయి విరిగింద‌ని.. దాన్ని ఆసుప‌త్రికి తీసుకెళ్లి క‌ట్టు క‌ట్టించార‌న్నారు. రామ‌గిరి మండ‌లంలో ఎవ‌రూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్త‌కూడ‌ద‌న్నారు. పార్టీ పేరు ఎత్తితే దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించ‌టంతో పాటు.. త‌న‌ను రామ‌గిరి పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి స్థానిక సీఐ.. ఎస్ ఐ స‌మ‌క్షంలో తెల్ల పేప‌రు మీద సంత‌కాలు తీసుకున్నార‌న్నారు.

అంతేకాదు.. తాము చేసిన ప‌ని గురించి ఎక్క‌డైనా మాట్లాడితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించార‌న్నారు. తాను వారి చెర నుంచి బ‌య‌ట‌ప‌డి.. జిల్లా ఎస్పీకి రిజిస్ట‌ర్ పోస్టు ద్వారా త‌న ఫిర్యాదును పంపిన‌ట్లుగా చెప్పారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌న‌ని.. తోపుదుద‌ర్తి బ‌ద్ర‌ర్స్ ప్ర‌ధాన అనుచ‌రుడిగా చెప్పారు. త‌న‌పై దాడి చేసిన ప‌రిటాల శ్రీ‌రామ్‌.. అత‌ని అనుచ‌రుల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మ‌రి.. పోలీసుల స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News