అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నాయకుడు పరిటాల రవి, ఏపీ మంత్రి పరిటాల సునిత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం విషయంలో గత కొద్దికాలంగా సాగుతున్న చర్చకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. శ్రీరామ్ వివాహం నిశ్చయమైందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఆయన తల్లి పరిటాల సునిత. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సునిత మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో తన పెద్ద కుమారుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఉంటుందని ప్రకటించారు.
ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ&సుశీల దంపతుల కుమార్తె జ్ఞానతో పరిటాల శ్రీరామ్ వివాహం జరగనున్నట్లు మంత్రి సునిత తెలిపారు. ఆగస్టు పదో తేదీన వీరిద్దరి నిశ్చితార్థం, అక్టోబర్ 1న వివాహం జరుగనున్నట్లు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా, 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.