పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు పదేళ్ల క్రితం నుంచి రాజకీయాల్లో ఉన్న సునీత.. ఇప్పుడు తన వారసుడ్ని రాజకీయాల్లో చూడాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే పరిటాల రవి వారసుడు శ్రీరామ్ కూడా గత ఐదేళ్ల నుంచి జిల్లాలో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. దీంతో.. వచ్చే ఎన్నికలే సరైన సమయమని ఆశిస్తున్న పరిటాల సునీత.. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ ని నిలబెట్టాలని చూస్తున్నారు. ఎంపీగా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపించాలని శ్రీరామ్ కూడా ఉవ్విళ్లూరుతున్నాడు.
అటు సునీత - ఇటు శ్రీరామ్ ఇద్దరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. అయితే.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఒకే ఎన్నికలో సీట్ ఇవ్వాలంటే చాలా పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది టీడీపీ అధినేత చంద్రబాబు. చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో.. పరిటాల శ్రీరామ్ కు సీటు ఇచ్చే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. తాను పోటీ చేసేది లేని అంతా చంద్రబాబు ఇష్టమని అటు సునీత - ఇటు శ్రీరామ్ ఇద్దూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తామని బాల్‌ని చంద్రబాబు కోర్టులోకి తోసేశారు. మరి సునీత - శ్రీరామ్ ఆశిస్తున్నట్లుగా హిందూపురం టిక్కెట్ పరిటాల వారసుడ్ని వరిస్తుందా లేదా వేచి చూడాలి.