వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పటి ముఖ్యమంత్రి కాలేడని పౌర సరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత జోస్యం చెప్పారు. జగన్ వస్తే రాష్ట్రంలో మర్డర్లు జరుగుతాయన్నారు. పరిటాల రవిని హత్య చేసింది జగన్ కుటుంబీకులేనని, తన పసుపు కుంకాలు తీసేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి దాదాపు 42 దేశాల నుంచి ప్రతినిధులు పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షనేతగా వారిని స్వాగతించాల్సింది పోయి అడ్డుకునేందుకు జగన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ కలలు కనడం మానేసి ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలో ఆలోచించాలని సునీత సూచించారు.
ప్రత్యేక హోదా ఉద్యమమంటూ స్వప్రయోజనాల కోసం విద్యార్థులను వైసీపీ అధ్యక్షుడు జగన్ రెచ్చగొడుతున్నారని సునీత ఆరోపించారు. కాబోయే ముఖ్యమంత్రినంటూ చెబుతున్న జగన్ కు మతి పోయిందని విమర్శించారు. పార్టీలోని సీనియర్లైన కనీసం ఏం మాట్లాడాలో జగన్ కు చెబితే బాగుంటుందన్నారు. జగన్ కాబోయే సీఎం అంటూ పదేపదే చెప్పడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని సునీత విమర్శించారు. పులివెందులలో మాట్లాడే విధంగా ఎక్కడంటే అక్కడ మాట్లాడితే కుదరని సునీత హెచ్చరించారు. అధికారులు, పోలీసులను బెదిరించడం సభ్యత కాదని, ఇటువంటి చేష్టలను ప్రజలు అంగీకరించరన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టింది వైఎస్సేనని, ఆ ప్రభుత్వంలో ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడని జగన్ ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలంటూ మాట్లాడే హక్కే లేదన్నారు. ముఖ్యమంత్రి బాబే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తని, అందుకే పార్లమెంట్‌లో తమ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, సుజనాచౌదరి పదేపదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని పరిటాల సునీత అన్నారు. పులివెందులకు నీరిచ్చినా టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదు, కాని బాబు అక్కడి రైతుల మేలు కోరుతూ నీరు ఇచ్చారన్నారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిందని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఉద్దేశమని పరిటాల సునీత తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/