నిజమేనండోయ్... తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రచిస్తున్న సంధి వ్యూహాలు అభాసుపాలైపోతున్నాయి. ఎక్కడికక్కడ టీడీపీ నేతల మధ్య తగాదాలు సమసిపోవడానికి బదులుగా మరింతగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు మాటలను టీడీపీ నేతలు పట్టించుకునే సమస్యే లేదన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. అయినా ఇప్పుడు ఈ విషయం ఎందుకంటారా? ఎందుకేమిటి... అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు మళ్లీ తన్నుకున్నారు. అది కూడా ఏ కొత్త వర్గమో కాదు. కలిసి కదలకుంటే... కఠిన చర్యలు తప్పవని బాబు నుంచి వార్నింగ్ అందుకున్న పాత వర్గాలే ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిన్న రెండోసారి రచ్చకెక్కాయి.
ఇలా బహిరంగంగా రెండు వేర్వేరు పార్టీల నేతల్లా తలపడిన ఇరు వర్గాలకు నేతృత్వం వహించిన వారెవరో కాదు.. సాక్షాత్తు చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పరిటాల సునీత, ఆ జిల్లాకు చెందిన ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరిలే. ఇటీవలే ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న ఫ్లెక్సీ యుద్ధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... వారిద్దరికి కాస్తంత గట్టిగానే వార్నింగులిచ్చారు. తన వద్దకు రావాలనుకుంటే... ఇరువురూ కలిసి వస్తేనే... లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా మొన్నటి పార్టీ జిల్లా శాఖ సందర్భంగా గట్టిగానే హెచ్చరించారు. ఇది జరిగి ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే ఈ రెండు వర్గాలు మళ్లీ బహిరంగంగా తలపడ్డాయి. అది కూడా గతంలో బాహాబాహికి వేదికగా నిలిచిన ధర్మవరంలోనే కావడం గమనార్హం.
నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... వరదాపురం సూరి ఇలాకా అయిన ధర్మవరంలో పరిటాల వర్గానికి చెందిన నేతలు ఓ కాంట్రాక్టు పనిని చేపట్టారు. అటుగా వెళుతున్న సూరి వర్గానికి చెందిన ఓ వ్యక్తిని వారు అవహేళన చేస్తూ మాట్లాడగా, కాస్తంత ఉక్రోషం పుట్టుకొచ్చిన సదరు గల్లీ నేత... మా ఇలాకాలో మీరెలా పనిచేస్తారంటూ నిలదీయడమే కాకుండా విషయాన్ని తమ వర్గం నేతలకు చేరవేశాడు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారగా... పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిన్న మిట్ట మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ గొడవ అప్పటికప్పుడు సద్దుమణిగింది.
అయితే కాస్తంత చల్లబడగానే సాయంత్రం వేళ ఇరువర్గాలు పట్టణం నడిబొడ్డున ఎదురెదురుగా నిలిచి రాళ్ల వర్షం కురిపించుకున్నారు. దీంతో చేసేది లేక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందట. అంతేనా పట్టణంలో ఏకంగా 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చేందుకు ఈ ఘటన కారణమైంది. ఈ విషయం తెలుసుకున్న బాబు అగ్గిమీద గుగ్గిలమయ్యారట. వెనువెంటనే విజయవాడ రావాలంటూ ఇటు సునీత - అటు సూరి వర్గాలకు ఆదేశాలు జారీ చేశారట. మరి బాబు వద్దకు వెళ్లే వారిద్దరూ ఏ తరహా ఫిర్యాదులు చేసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/