పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. తొలుత.. రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక కాన్వాయ్‌లో పార్లమెంటుకు బయలు దేరి వచ్చారు. ముందుగా రాష్ట్రపతి అశ్వికదళం నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పార్లమెంటుకు బయలుదేరారు.
అప్పటికే పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు వేచి ఉన్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ పార్లమెంటుకు చేరుకున్న తర్వాత ఉప రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్ లు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించారు. తొలుత జాతీయ గీతం ఆలపించిన తర్వాత రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నా రు. రేపు 2023-24 వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తారు. రేపు 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభ ముందుంచనున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి.
తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 14 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాలు మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో 27 సార్లు ఉభయసభలు భేటీ కానున్నాయి. ఈ సెషన్లో 36 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.