పొరుగునే ఉన్నప్పటికీ నిత్యం పక్కలో బల్లెంలాగా వ్యవహరించే పాకిస్తాన్ కు భారత్ ఘట్టి ఝలక్ ఇచ్చింది. అదే రీతిలో మరో పక్కదేశమైన చైనా సైతం ఉలిక్కి పడేలా చేసింది. భారతదేశ విభజన సమయంలో తమ ఆస్తిపాస్తులను మన దేశంలోనే వదిలేసి పాకిస్తాన్-చైనాలకు వలస వెళ్లిన వారికి ఇక్కడి అస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. ఇందుకు సంబంధించి 49 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న శత్రువుల ఆస్తి సవరణ బిల్లు (ఎనిమీ ప్రాపర్టీ బిల్)-2017ను లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. గత వారం ఈ బిల్లుకు రాజ్యసభ ప్రతిపాదించిన సవరణలను లోక్ సభ ఆమోదం తెలిపింది. 1968నాటి ఈ చట్టానికి ఇంతకాలం తరువాత సవరణలు చేశారు. ఎనిమీ ప్రాపర్టీ అంటే - శత్రువుకు సంబంధించిన - శత్రువు పక్షాన సంపాదించిన - శత్రు సంస్థకు చెందిన ఆస్తి అని బిల్లులో నిర్వచనం చెప్పారు. ఈ ఆస్తులన్నీ ఇకపై కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.
1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తరువాత 1968లో ఈ చట్టాన్ని చేశారు. ఇప్పుడు వీటికి కస్టోడియన్ అధికారాలను ప్రభుత్వానికి కట్టబెడుతూ సవరణలు చేశారు. ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ లలో విస్తారంగా ఉన్న రాజా మొహమ్మద్ అమిర్ మొహమ్మద్ ఖాన్ ఆస్తులకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో ఈ బిల్లులో సవరణలు తప్పనిసరి అయింది. ‘ఈ బిల్లు ప్రధానోద్దేశం 1968నాటి చట్టానికి మరింత స్పష్టత ఇవ్వటం. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం చూపటం’ అని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 2010లోనే ఈ సవరణలతో బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం పొందలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ అంశంపై అయిదు సార్లు ఆర్డినెన్స్ లు జారీ చేశారు. అయిదో ఆర్డినెన్స్ గడువు మంగళవారంతో పూర్తవుతున్న నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ లోక్‌సభ ఆమోదాన్ని పొందారు. ‘కొంతమంది ఎంపీలు ఈ విధంగా ఆస్తుల స్వాధీనం చేసుకోవటం సహజ న్యాయానికి విరుద్ధమని అంటున్నారు. ఏ విధంగా ఇది సహజన్యాయం కాదో నాకర్థం కావటం లేదు. పాకిస్తాన్ భారతీయ పౌరుల ఆస్తులన్నింటినీ జప్తు చేసింది. అలాంటప్పుడు మనం చేసేది కూడా సహజ న్యాయమే’ అని స్పష్టం చేశారు. ఈ చట్టం పూర్తి కావాలంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన చట్టాలు చేసుకోవలసి ఉంటుందని, ఇందుకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాదనే భావిస్తున్నానని రాజ్ నాథ్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/