‘‘సైమన్’’ మాటనే శశిథరూర్ చెబుతున్నారు

Update: 2016-01-26 05:09 GMT
మేధావిగా పేరున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి. సొంత పార్టీని వదిలేసి ప్రత్యర్థి పార్టీ నేతల్ని కీర్తించేందుకు సైతం వెనుకాడని కొందరునేతల్లో శశిథరూర్ ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఉన్న వివాదాలకు తగ్గట్లే ఆయన రాజకీయాల్లోనూ వివాదాలు కనిపిస్తాయి. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన థరూర్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

భారతదేశానికి పార్లమెంటరీ వ్యవస్థ ఏమాత్రం సరిపోదని తేల్చారు. భారతదేశం లాంటి దేశానికి అధ్యక్ష తరహా పాలన సరిగ్గా సరిపోతుందని చెప్పుకొచ్చారు. అయితే.. ఇలాంటి మాటలు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పటం మానేసి.. పవర్ లేనప్పుడు.. పాలసీని విమర్శించటం వల్ల పెద్ద ప్రయోజనం లేదేమో. దేశంలో అమలవుతున్న పార్లమెంటరీ వ్యవస్థపై విమర్శలు చేసిన ఆయన మాటలు చూస్తే.. ‘‘భారతదేశ తత్వానికి పార్లమెంటరీ వ్యవస్థ ఏ మాత్రం సరిపోదు. ఈ వ్యవస్థ ఒక చిన్న ద్వీపానికి సరిపోతుంది. ఇంత జనాభా.. వైవిధ్యం ఉన్న దేశంలో అధ్యక్ష తరహా పాలన బాగుంటుంది. బ్రిటీషోళ్లు మన మీద రుద్దని వ్యవస్థ ఇది. ఇప్పటికీ ప్రతి దానికీ బ్రిటీష్ వైపు చూసేలా మనల్ని తయారు చేశారు. అధ్యక్ష తరహా పాలనే సరైనదంటూ సైమన్ కమిషన్ సభ్యుడు క్లెమెంట్ అట్లీ కూడా చెప్పారు’’ అంటూ చెప్పుకొచ్చారు. మరి.. దీనిపై రాజకీయ పక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో..?
Tags:    

Similar News