బుధవారం రాత్రి నుంచి సంచలనంగా మారిన విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త కమ్ వ్యాపారవేత్త అయిన పరుచూరి రామకోటేశ్వరరావు కిడ్నాప్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో అంతకంతకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తొలుత తన భర్త కిడ్నాప్‌కు గురైనట్లుగా ఎంపీ కొత్తపల్లి ఆరోపించారు. అయితే.. తాను కిడ్నాప్ కు గురి కాలేదంటూ తన భార్య మాటను సరి చేస్తున్న రామకోటేశ్వరరావు.. తనను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ తనను బెదిరించటంతోపాటు.. అతనే స్వయంగా ఒక పత్రం మీద రాసి తన చేత సంతకం చేయించుకున్నారని.. అది కాకుండా మరో మూడు లెటర్స్ మీద కూడా ఫోర్స్ గా సంతకాల్ని తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెబుతున్న ఎంపీ భర్త.. మీటింగ్ కోసం తాజ్ కృష్ణకు పిలిచారని.. అక్కడకు వెళ్లిన తర్వాత ఈ వ్యవహారంలో భాగస్వామి అయిన తలసాని కుమారుడు సాయి ర్యాష్ గా వ్యవమరించారని.. ఒకదశలో అసలు భూమికి సంబంధించి ఒరిజినల్స్ ఉన్నాయా? అంటే ఉన్నాయని చెప్పి చూపిస్తే.. వాటిని తీసుకున్నారని చెబుతున్నారు. ఆరు గంటల పాటు తనను ఉంచారని.. జరిగింది కిడ్నాప్ కాదని.. బెదిరించి.. తనను వదిలేసినట్లుగా రామకోటేశ్వరరావు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే ఈ భూవివాదం పెద్ద ఎత్తున ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఒక ఎంపీ భర్త.. ఒక మంత్రి కుమారుడు మొదలుకొని కొందరు బిల్డర్లు ఈ వ్యవహారంలో ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చినవి కొన్నే ఉంటాయని.. బయటకు రావాల్సినవి చాలానే ఉంటాయన్న మాట వినిపిస్తోంది. వ్యవహారం రచ్చగా మారిన నేపథ్యంలో.. ఒక్కొక్క విషయం బయటకు రావటం కానీ.. లేదంటే పెద్ద మనుషులు ఎంటర్ అయి ఇష్యూను స్మూత్ గా సెటిల్ చేయటమో ఖాయమని చెప్పొచ్చు.