ఎర్ర బస్సైనా.. ఎయిర్ బస్సైనా ప్రయాణికుల ఘర్షణలు జరుగడం కామన్ అయిపోయింది. ఎర్ర బస్సులో సీటు కోసం కర్చీఫ్ లు వేయడం.. నేను ముందచ్చానంటే.. నేను ముందు కర్చీఫ్ వేశానని మరొకరు.. కండక్టర్ తో చిల్లర విషయంలో గొడవలు ఇలాంటి మన నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలు విమానాల్లో ఇటీవలి కాలంలో వెలుగు చూస్తుండటం ఆశ్చర్యానికి కలిస్తోంది.
విమానాల్లో ప్రయాణించే వారిలో ఎక్కువ శాతం ఉన్నత చదువులు చదువున్న వారో లేదంటే ఉన్నతోద్యోగాలు చేసేవారే ఉంటారు. అలాంటి వాళ్లు సైతం తోటి ప్రయాణికుల విషయంలో సంయమనం కోల్పోయి కొట్లాటలకు దిగుతుండటం విడ్డూరంగా మారుతోంది. అయితే ఇటీవల కాలంలో విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణలు పెరిగిపోతుండటం ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన వాగ్వాదం ఏకంగా కొట్లాటకు దారితీసింది. ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపలపై పదేపదే కొట్టాడు. వీరిని ఆపేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయత్నించినా ఆ వ్యక్తి వినిపించుకోలేదు. చివరి తోటి ప్రయాణికులు కలుగజేసుకొని ఆ గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానం బయలుదేరింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన సహనం కోల్పోయి తోటి ప్రయాణికుడిని చెంపదెబ్బలు కొట్టాడు.
వీరికి నచ్చజెప్పేందుకు ఎయిర్ హోస్ట్ ప్రయత్నించింది. అయినా వినకుండా వీరిద్దరు కొట్లాటకు దిగారు. వీరి గొడవ పెద్దది కావడంతో తోటి ప్రయాణికులు కలుగజేసుకొని వీరిని విడిపించారు. ఈ సంఘటనను విమానంలోని మరో ప్రయాణికుడు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. కాగా ఈ ఘటనపై థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View
Full View Full View Full View Full View