దసరా పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుండి 30 రూపాయలకు అమాంతం పెంచేయడంతో ప్రయాణీకులు - వాళ్ళని తీసుకువెళ్ళడానికి స్టేషన్ కు వచ్చిన వారు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ దసరా హాలిడేస్ ఉన్న పది రోజులు ఇవే ధరలు ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీంతో విజయవాడ జనం రైల్వే అధికారులకు షాక్ ఇచ్చారు.
విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చిన తమ వాళ్ళను రిసీవ్ చేసుకోడానికి వచ్చిన వాళ్లు ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోకుండా గుంటూరు ప్యాసింజర్ రైలుకి టిక్కెట్ తీసుకుని తమ పని కానిచ్చుకుంటున్నారు. విజయవాడ నుండి గుంటూరు కి టిక్కెట్ పది రూపాయలు ఉండడంతో ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుంటే 30 రూపాయలు అవుతుందని ప్రయాణీకులు తెలివిగా ఇలా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దయచేసి అలా చేసేవాళ్ళందరూ ఫ్లాట్ ఫామ్ టికెట్టే తీసుకోవాలని - ఆ వచ్చిన డబ్బులను ప్రయాణీకుల భద్రతా కోసమే ఉపయోగిస్తామని విజ్ఞప్తి చేశారు.