ఎన్ ఆర్ ఐ భర్తల ఆగడాలకు ఇక కాలం చెల్లనుంది. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాలు చేస్తున్నామని పేర్కొంటూ తమ ఆకర్షణీయమైన జీవనశైలిని ఎరగావేసి అమ్మాయిలను పెళ్లిచేసుకొని ఆ తర్వాత ఎన్ ఆర్ ఐ యువకులు ముఖం చాటేస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. లక్షల్లో కట్నం తీసుకుని, కొద్దిరోజుల్లో వస్తానంటూ నవ వధువుని మభ్యపెట్టి విదేశాలకు చెక్కేసి ముఖం చాటేసే ఎన్ ఆర్ ఐ పెళ్లికొడుకుల తాటతీసే కొత్త చట్టం ప్రకారం పలువురు అరెస్టయ్యారు. 45 మంది ఎన్నారైల పాస్ పోర్టులను రద్దు చేసి భారత విదేశాంగశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
దుర్భుద్ధితో వ్యవహరించి కట్టుకున్న వారిని గాలికి వదిలివేసిన వారికి అరదండాలు వేసేందుకు కొద్దికాలం క్రితం బిల్లు రూపొందింది. ఎన్నారై భర్తల కారణంగా అన్యాయానికి గురవుతున్న మహిళల కోసం రూపొందించిన ఈ చట్టం రాజ్య సభలో ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, ఈ చట్టం ఆమోదానికి ముందే కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. తమ భార్యలను వదిలేసిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులను రద్దు చేసినట్లు కేంద్ర మహిళ, శిశుసంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ తెలిపారు.
కాగా, కొత్త చట్టం గురించి స్పందిస్తూ, ప్రతిపాదిత బిల్లు చట్టం రూపం దాల్చితే, భారత్ లో పెళ్లిచేసుకునే ప్రతి ఎన్నారై.. తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. లేనిపోంలో వారి పాస్ పోర్టు రద్దు చేస్తారని, వారికి సంబంధించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునంటారని స్పష్టం చేశారు. కొత్త చట్టంతో అక్రమార్కులు బెంబేలెత్తడం ఖాయమని అంటున్నారు.