రికార్డు మెజార్టీతో వరంగల్ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన టీఆర్ ఎస్ నేత పసునూరి దయాకర్ కు అరుదైన అవకాశం దక్కింది. ఎంపీగా గెలిచిన మూడో రోజే ఎంపీగా ప్రమాణస్వీకారం చేయటంతో పాటు.. పార్లమెంటులో కూర్చునే భాగ్యం దక్కింది. ఎంత ఎంపీగా గెలిచినా.. వెనువెంటనే పార్లమెంటులో కూర్చునే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఎంపీగా గెలిచిన వెంటనే పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేకపోవటం.. ప్రమాణస్వీకారానికి సమయం పట్టటం లాంటివి చోటు చేసుకుంటాయి. కానీ.. దయాకర్‌కు మాత్రం అందుకు భిన్నం.
మంగళవారం ఉదయమే గెలుపు రుచిని చూసిన ఆయనకు మంగళవారం మధ్యాహ్నానికి బంపర్ గెలుపుతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. బుధవారం హైదరాబాద్ కు వచ్చి పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి.. ఆయన ఆశీస్సులు తీసుకున్న ఆయన.. గురువారం ఉదయానికి ఢిల్లీలో ఉన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావటంతో.. దయాకర్ చేత లోక్ సభా స్పీకర్ ప్రమాణస్వీకారం చేశారు. రికార్డు మెజార్టీతో విజయం సాధించి పార్లమెంటుకు వచ్చిన దయాకర్ ను పలువురు నేతలు ఆసక్తిగా గమనించారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం లోక్ సభలో తనకు కేటాయించిన సీట్లో దయాకర్‌కూర్చున్నారు. ఎంపీగా గెలిచిన మూడో రోజు ప్రమాణస్వీకారం పూర్తి చేసుకోవటం... పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనటం లాంటి అరుదైన అవకాశం దయాకర్ కే దక్కిందని చెప్పాలి.