తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న మోడీ పరివారానికి బీహార్ ఫలితాలు భారీ స్పీడ్ బ్రేకర్ గా మారటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. బీహార్ ఫలితాలతో భారీగా దెబ్బ తిన్న ఇమేజ్ ను తిరిగి తెచ్చుకోవటం ఎలా అన్నది ఒక సమస్య అయితే.. మరోవైపు మోడీ సొంతరాష్ట్రంలో పటేళ్ల ఆందోళన పంటి కింద రాయిలా మారింది.
రోజురోజుకీ.. అంతకంతకూ చాప కింద నీరులా మారిన పటేళ్ల ఉద్యమాన్నికంట్రోల్ చేసేందుకు గుజరాత్ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం రాని పరిస్థితి. తాజాగా అక్కడ జరురుగుతున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని పటేళ్లు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా.. ఊహించని విధంగా బీజేపీకి షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే బీజేపీ నేతల్ని అనుమతించ్చొద్దని.. వాళ్లను ఎన్నికల్లో ఓట్లు అడగటానికి రానివ్వకూడదని పటేళ్ల పెద్దలు నిర్ణయించారు.
ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతల్ని రానివ్వకుండా చేయాలన్న వినూత్న నిరసనను గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్టార్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని వివిధ కాలనీలకు చెందిన పటేళ్లు సమావేశమై.. బీజేపీ నేతల మీద 114 సెక్షన్ విధించామని.. అందుకే వాళ్లను ఓట్లు అడగటానికి రాకుండా నిరోధించాలని వారు పిలుపునిస్తున్నారు. పటేళ్ల మాట కానీ వర్క్ వుట్ అయితే మాత్రం కమలనాథులకు ఈ వ్యవహారం మరో షాక్ కావటం ఖాయం. బీహార్ ఫలితాలతో తలబొప్పి కట్టిన బీజేపీ నేతలకు.. తమ అధినేత సొంత రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలితే అంతకు మించిన ఇబ్బంది మరేం ఉంటుంది.