షాకింగ్ : గాంధీ నుండి పరారైన వైరస్ బాధితుడు!

Update: 2020-06-05 01:30 GMT
దేశాన్ని వణికిస్తున్న వైరస్ మహమ్మారి ప్రభావం తెలంగాణలో కూడా భారీగానే ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,020 కాగా... వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. వైరస్‌‌ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1556 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1365 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇకపోతే , తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో వైరస్ విజృంభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైరస్ సోకిన వ్యక్తి కనిపించకుండాపోయిన ఘటన నగరంలో కలకలం సృష్టిస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసించే 60 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం కారణంగా మే 30న ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. దగ్గు, దమ్ము, ఆస్తమా, ఉన్నట్లు గుర్తించిన వైద్యులు..అతడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో గాంధీలో అతడికి కరోనా టెస్టులు చేయగా వైరస్ పాజిటివ్ ‌గా తేలింది.

దీనితో ఆ వృద్ధుడి గురించి వైద్య శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో వైద్యులు, పోలీసులు ఆ కాలనిలో సర్వే చేపట్టారు. బాధితుడికి చెందిన ప్రైమరీ కాంటాక్టులపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే బాధితుడు హైదరాబాద్‌ లో కనిపించకపోవడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అతడి కోసం వెతుకులాట ప్రారంభించారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అటు వైరస్ బాధితునికి సంబంధించిన 13 మంది కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌ లో ఉంచారు.
Tags:    

Similar News