ఆ సీఎం కోరికను మూడు నిమిషాల్లో తీర్చిన కేంద్రం

Update: 2017-04-30 06:38 GMT
కేంద్రంతో జరగాల్సిన పనులకు ఎంతో టైం పడుతుంది... సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి.. అప్పుడ గానీ ఏం చేయాలా అన్నది తేలదు. కానీ.. ఒడిశా సీఎం చేసిన రిక్వెస్టును కేంద్రం కేవలం మూడు నిమిషాల్లో ఓకే చెప్పడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులను నోరెళ్లబెట్టేలా చేసింది. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు అయితే మిత్రపక్ష హోదాలో ఉన్నా నన్ను పట్టించుకోరు కానీ నవీన్ పట్నాయిక్ ట్వీట్ చేస్తే చాలు పనులు చేసి పెడుతున్నారని తెగ రగిలిపోతునత్నారట.
    
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరిన ఓ చిన్న కోరికను రైల్వే మంత్రి సురేష్ ప్రభు మూడంటే మూడే నిమిషాల్లో తీర్చారు. పూరి - కోణార్క్ పట్టణాల మధ్య కొత్త రైల్వే లైన్ ను మంజూరు చేయాలని, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో సగ భాగాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని చెబుతూ, సురేష్ ప్రభు అధికారిక ట్విట్టర్ ఖాతాకు నవీన్ పట్నాయక్ ట్వీట్ పంపారు. పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ లైన్ ఉపకరిస్తుందని చెప్పారు.
    
అది పంపించిన  మూడు నిమిషాల్లోనే నవీన్ పట్నాయక్ కు సమాధానం లభించింది. కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలుపుతున్నానని, సంతకాలు చేసేందుకు ఇవాళైనా రెడీగా ఉన్నామని ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు.
    
కాగా ఏపీలో రైల్వే లైన్లు - విశాఖ జోన్ వంటివాటి విషయంలో చంద్రబాబు  స్వయంగా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి నా పనులు కావడం లేదు. కానీ... పొరుగు రాష్ర్టం సీఎం ఒక్క ట్వీటుతో మూడు నిమిషాల్లో పని చేయించుకున్నారు. దీని వెనుక కారణాలు ఎలాంటివి ఉన్నా కానీ చంద్రబాబు మాత్రం ఈ సంగతి తెలిశాక నిద్రపోలేదట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News