ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తాము చేసే పనులకు సంబంధించిన వాదనలు వినిపిస్తుంటారు. హత్య చేసినోడికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతి పాడు పనికి తమ కోణంలో అర్గ్యుమెంట్ వినిపిస్తుంటారు. ఏదైనా విషయానికి సంబంధించి వివరాలు విన్నంతనే.. ఆ పని చేసినోళ్ల మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. అయితే.. అదే వ్యక్తి తానెందుకు ఆ పని చేశానో చెప్పినప్పుడు కన్వీన్స్ కావటమే కాదు.. అరే.. తప్పుగా అనుకున్నామే అన్న భావన కలుగుతుంది. అలాంటి దరిద్రపుగొట్టు టాలెంట్ ను ప్రదర్శించిన పెద్దమనిషి యవ్వారం తెలుసుకోవాల్సిందే.
ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక మహిళ వద్దకు వచ్చిన పెద్ద మనిషి.. రెండు మాటలు మాట్లాడారు. అందరూ చూస్తుండగానే చప్పున ముద్దు పెట్టేశాడు. అది కూడా ఏకంగా పెదాల మీద. ఊహించని రీతిలో చోటు చేసుకున్న పరిణామానికి విస్తుపోయిన సదరు మహిళ షాక్ కు గురయ్యారు. తీవ్ర ఆగ్రహానికి గురై.. మండిపడుతూ ట్రైన్ దిగి వెళ్లిపోయారు. సదరు వ్యక్తి మీద కేసు పెట్టారు.
కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. తెలీని మహిళకు ముద్దు ఎందుకు పెట్టావన్న దానికి సదరు వ్యక్తి వినిపించిన వాదన విన్నంతనే ఔరా.. అనిపించటమే కాదు.. కన్వీన్స్ చేసేలా ఉండటం విశేషం. అయితే.. అతని వాదనకు కౌంటర్ అర్గ్యుమెంట్ చేయొచ్చనుకోండి. కానీ.. చెప్పిన తీరు మాత్రం అతను చేసింది తప్పేం లేదన్న భావనకు గురయ్యేలా చేయటం విశేషం.
ఇంతకీ అతనెవరు? ఏం చెప్పారన్న విషయంలోకి వెళితే.. అతని పేరు పాల్ గ్యాస్కోయినే. వయసు 52 ఏళ్లు. ఒకప్పడు పేరున్న ఫుట్ బాల్ ప్లేయర్. ఈ తరానికి పెద్దగా తెలీదు. తన మీద పెట్టిన ఫిర్యాదు మీద తన వాదన వినిపిస్తూ.. గత ఏడాది తాను రద్దీగా ఉన్న ట్రైన్ లో ప్రయాణిస్తున్న వేళ.. ముద్దు పెట్టుకున్నది నిజమేనని చెప్పారు. ఆ టైంలో తాను తాగి ఉన్నట్లు ఒప్పుకున్నారు. అయితే.. ఆమెను ముద్దు పెట్టుకోవటానికి అసలు కారణం వేరే ఉందన్నారు.
‘‘తాగి ఉన్న కారణంగా ఆమెను ముద్దు పెట్టుకోలేదు.అక్కడున్న వారిలో కొందరు ఆమె వైపు చూస్తే.. ఆమె లావుగా ఉందని.. అసహ్యంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. వారి మాటలకు ఆమె నొచ్చుకోవటం.. మనసు కష్టపెట్టుకోవటం కళ్లారా చూశా. ఆమె వద్దకు వెళ్లి.. మీరు లావుగా లేరు. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఆమెను నమ్మించటం కోసం పెదాల మీద కిస్ చేశారు. ఇదంతా ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచేందుకే చేసిన పని. ఎలాంటి దురుద్దేశంతో ముద్దు పెట్టుకోలేదు’’ అంటూ తన వాదనను వినిపించాడు.
కేసును వాయిదా వేసిన కోర్టు.. చేసిన ఎదవ పనికి ఎలాంటి శిక్ష విధిస్తుందో తెలీదు కానీ.. ఇతడు చెప్పిన వాదన విన్నంతనే నిజమే కదా? అన్నట్లు అనిపించినా.. అందంగా లేవు.. అసహ్యంగా ఉన్నావని ఎవరైనా అమ్మాయిని మరెవరైనా కామెంట్ చేస్తే.. ఆత్మవిశ్వాసం పెంచటానికి పెదాల మీదే ముద్దులు పెట్టేయాలా? అలా చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుందా? అన్న క్వశ్చన్లు మదిలో మెదిలినప్పుడు మాత్రం ఒళ్లు మండక మానదు. మరి.. కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.