ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ సారి ప్రముఖ ఆర్థిక వేత్తలు పాల్ ఆర్ మిల్ గ్రామ్, రాబర్ట్ బి విల్సన్ లకు ఈ అత్యున్నత అవార్డ్ దక్కింది.
వేలం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం.. కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గాను వీరిద్దరికీ ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పాల్ మిల్ గ్రామ్, రాబర్ట్ విల్సన్ వేలం సిద్ధాంతాన్ని మెరుగుపరిచారు కొత్త వేలం ఆకృతులను కనుగొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులకు, కొనుగోలుదారులకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని నోబెల్ అకాడమీ వ్యాఖ్యానించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 10 మిలియన్ క్రోనా (1.1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి, బంగార పథకం లభిస్తుంది.
రాబర్ట్ విల్సన్ కామన్ వ్యాల్యూతో వస్తువుల వేలం విధానాన్ని అభివృద్ధి చేశారు. మరోవైపు పాల్ మిల్ గ్రామ్ వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించారు.