పాల్.. టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థా కేటీఆర్ సార్? ఒక్క సెటైర్ తో తేల్చేశారే..?

Update: 2022-04-25 13:30 GMT
వాగ్ధాటిలో కానీ, వాక్ శుద్ధిలో కానీ.. విషయ పరిజ్హానంలో కానీ.. వ్యవహార దక్షతలో కానీ.. తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడు కేటీఆర్. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు దేశంలో మరే మంత్రికీ అందనంత ఎత్తులో ఉంది. తెలంగాణకు కేటీఆర్ తీసుకొస్తున్న కొత్త పరిశ్రమలు, ఇప్పటికే ఉన్నవాటి విస్తరణ ప్రయత్నాల గురించి చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడ మాట్లాడాల్సింది కేటీఆర్ విజన్. తండ్రి కేసీఆర్ కు ఎలాగైతే తెలంగాణ పట్ల నిబద్ధత, విజన్ ఉన్నదో.. కేటీఆర్ కు తాను చూస్తున్న శాఖ పట్ల అంతే విజన్ ఉంది. ప్రత్యేకించి ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచే ప్రయత్నాలు కేటీఆర్ ఇమేజ్ ను మరింత పెంచాయి. మిగతా రాష్ట్లాలకు ఈ స్థాయి వ్యవహార దక్షత ఉన్న మంత్రి లేకపోవడం బ్యాడ్ లక్. కొంతలో కొంత ఏపీకి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేసినా ఆయన హఠాన్మరణం పాలయ్యారు.

ఇంటర్వ్యూలో అనేక పాయింట్లు ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్లీనరీ జరుగనుంది. 21వ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న టీఆర్ఎస్.. ఈ ఉత్సవాలను ఈసారి ఆహ్వానిత సభ్యులకే పరిమితం చేసింది. వాస్తవానికి కేసీఆర్ మానస పుత్రిక అయిన టీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉద్యమ సమయంలో అయినా ఇంతే చేశారు. కానీ, రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆ ముచ్చట లేదు. ఈ సారి మాత్రం బహిరంగంగా చేస్తున్నా.. ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేశారు.

దీనికి వేరే కారణాలు ఉండొచ్చు. ఈ ప్లీనరీ నేపథ్యంలో కేటీఆర్.. ఓ ప్రధాన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చాలా విషయాలకు కచ్చితంగా తేల్చి చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చదివిన వారు ఎవరైనా సరే.. కేటీఆర్ ఎంత స్పష్టతతో ఉన్నారో తెలుసుకుంటారు. ఇక్కడే మంత్రి ఓ సెటైర్ వేశారు. అదికూడా మామూలు సెటైర్ కాదు.

అదిరిపోయే సెటైర్.ప్రతిపక్షాలను పుల్లలా తీసేస్తూ.. రాజకీయాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీని, అధికార పార్టీ ప్రతిపక్షాలను తీసిపారేయడం సహజం. వారి వ్యూహంలో భాగమే అది. తాము ఏమాత్రం పోటీకి తగ్గడం లేదని చెప్పే ప్రయత్నం అది. ఇందులో భాగంగానే పరస్పర విమర్శలు. ప్రతి విమర్శలు. ప్రత్యర్థులను లెక్కలోనికి తీసుకోనట్లు చేసే ఆరోపణలూ వీటిలో ఉంటాయి. తాజాగా కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటన్నిటికీ మించిన, సెటైరికల్ సమాధానం కనిపించింది. అదేమంటే.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని ప్రతికా విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన జవాబు చూస్తే అందరూ ఫక్కున నవ్వాల్సిందే.

పాల్, మజ్లిస్ అట..వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థులు కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ, అసదుద్దీన్ ఎంఐఎం అని మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూయర్ కు సమాధానం ఇచ్చారు. అంటే.. ఇక్కడ రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ను, బండి సంజయ్ సారథ్యంలోని బీజేపీని, షర్మిల వైటీపీని, ప్రవీణ్ కుమార్ బీఎస్పీని అన్నటినీ ఆయన తోసిరాజన్నారు. ఇది నిజంగా ప్రత్యర్థి పార్టీల పట్ల హ్యుమిలియేషనే. మరోవైపు కేటీఆర్.. తమ ప్రత్యర్థులుగా మజ్లిస్, కేఏ పాల్ లను పేర్కొనడం ప్రస్తుతానికి అందరినీ నవ్వించినా.. మున్ముందు చర్చకు తావివ్వనుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News