బీజేపీ తో పవన్ స్నేహం.. తెరవెనుక బాబేనా?

Update: 2020-01-29 04:52 GMT
చంద్రబాబు-పవన్ కళ్యాణ్.. ఈ ఏపీ పొలిటిషియన్స్ మధ్య ఏదో విడదీయరాని బంధం ఉందన్న అనుమానాలు ఇప్పుడు ఏపీలోని కీలక నేతలు వ్యక్తం చేస్తున్నారట.. ఇదే వారి మదిని కలవరపెడుతున్నాయట.. ఏపీలో 2014లో పొత్తు పెట్టుకొని గెలిచినప్పటి నుంచి చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ ప్రాణమిస్తాడన్న చర్చ రాజకీయాల్లో ఉంది. ఆయన చెప్పినట్టు చేస్తూ రాజకీయం చేస్తాడన్న విమర్శలు కొని తెచ్చుకున్నాడు.

పోయిన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికార టీడీపీని వదిలి ప్రతిపక్ష జగన్ పార్టీని పవన్ టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబును ఒక్క మాట కూడా అనని వైనం అందరికీ తెలిసిందే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు మొదలు పెట్టిన ఉద్యమాలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

చంద్రబాబు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని.. వీరిద్దరూ తెరవెనుక స్నేహితులు అని బీజేపీలోని కీలక నేతలు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేనాని ఢిల్లీ వెళ్లి బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై కూడా వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జనసేనాని పవన్ కళ్యాన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని.. జగన్ సర్కారును టార్గెట్ చేయడమే అజెండాగా రూపొందించారని.. బీజేపీ తుపాకితో జగన్ ను కాల్చడానికి పవన్ ను రాజకీయం గా చంద్రబాబు వాడుకుంటున్నాడన్న ప్రచారం ఇప్పుడు బీజేపీలో సాగుతోంది. మరి ఇది నిజమేనా కాదా అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుంది.
Tags:    

Similar News