పవన్ బాగా హర్ట్ అయ్యారా... జోగయ్య అందుకే...?

Update: 2023-07-05 06:00 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల కు కొత్త కాదు కానీ ఆరోపణల ను స్వీకరించే విషయం లో మాత్రం  ఇంకా కొత్త వారిగానే ఉంటున్నారు. గుండె ను మెత్తగానే ఉంచుకుంటున్నారు అని అంటున్నారు. రాజకీయాల్లో ఉన్న వారు ఏమి మాట్లాడినా దులుపుకు ని పోతారు. ఆరోపణలను పెద్దగా లెక్క చేయరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి భిన్నం. తనను ఎవరైనా ఏమైనా అంటే ఆయన పదేళ్ళు అయినా గుర్తు పెట్టుకుంటారు.

ఒక విధంగా రాజకీయాల కు ఇది సూట్ కాని అంశం. ఆ మాట కు వస్తే చంద్రబాబు జగన్ ఈ ఇద్దరూ రాజకీయంగా ఎన్నో మాటల ను  భరించారు. ఇప్పటికీ భరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయంగా ఏ పదవీ చేపట్టలేదు. ఒక విధంగా చూస్తే ఈ రోజుకీ ఫ్రెష్ అనే చెప్పాలి.

ఆయన మీద విమర్శలు చేయడానికి అలా చూస్తే కనుక ఏమీ లేవు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరచే విమర్శలు చేస్తున్నారు. 2009 నుంచి ఇది ఉందని చెప్పాలి. ఆయన యువ రాజ్యం ప్రెసిడెంట్ గా ఉన్నపుడు కూడా ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వస్తే చివరికి పవన్ రేణూ దేశాయ్ ని అప్పట్లో పెళ్ళి చేసుకుని ఆ ఆరోపణల కు చెక్ పెట్టారు.

ఇక 2014లో ఆయన రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చినపుడు  ఇలాగే విమర్శలు వచ్చాయి. అయితే తనకు అందరి జీవితాలూ జాతకాలూ తెలుసు అంటూ పవన్ అప్పట్లో ఉమ్మడి ఏపీ లోని నాయకుల కు గట్టి షాక్ ఇచ్చారు. ఇక ఏపీ లో వైసీపీ టీడీపీ ఈ రెండూ కూడా పవన్ని విమర్శలు చేస్తూ వచ్చినవే. అయితే వైసీపీ ఇంకా ఎక్కువగా చేస్తోంది అంటే పవన్ టార్గెట్ చేసింది ఆ పార్టీనే అని అంటారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడితే ఆయన పెళ్ళిళ్ల మీద విడాకుల మీదనే విమర్శలు చేస్తూంటారు. అది కాస్తా ఇపుడు వైసీపీ మంత్రుల నుంచి కూడా పై దాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అవే విమర్శలు చేస్తున్నారు. జగన్ ఇప్పటికి కొన్ని సార్లు ఇలాంటి ఆరోపణలు చేశారు. దానికి పవన్ నుంచి జనసేన నుంచి ధీటైన జవాబే వచ్చింది. అయితే తాజాగా కురుపాం లో పవన్ మీద జగన్ చేసిన ఆరోపణలు ఇంకా డోస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

వివాహ వ్యవస్థను నడి రోడ్డు మీదకు పవన్ తెచ్చారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం విడాకులు ఇవ్వడం ఆయన కు అలవాటు అని జగన్ కామెంట్స్ చేయడం ద్వారా ఆయన నైతికతను ప్రశ్నించారని అంటున్నారు. అలాగే మహిళా లోకానికి ఆయన పట్ల ఆగ్రహం కలిగేలా ఈ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

దాంతోనే పవన్ తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక జగన్ విమర్శలు చేసి వారం రోజులు దాటింది. దానికి మీడియా ముఖంగా జనసేన నాయకులు జవాబు చెప్పారు పవన్ అయితే భీమవరం సభ లో జగన్ కి డైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేసారు. ఇంత జరిగాక కూడా మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఫీల్డ్ లోకి వచ్చి జగన్ కి లేఖ రాయడం అందులో పెళ్ళిళ్ళ విషయం గురించి చెబుతూ మీకెందుకు అవన్నీ అంటూ జగన్ని విమర్శించడం బట్టి చూస్తే జగన్ చేసిన ఆరోపణల వాడి వేడి ఇంకా చల్లారలేదా అని అనిపిస్తోంది.

అంతే కాదు ఇలాంటి ఆరోపణలు మానుకోవాల ని కూడా జోగయ్య సూచిస్తున్నారు. మొత్తానికి పవన్ పెళ్ళిళ్ళ మీద వైసీపీ చేస్తున్న విమర్శలు జనసేనాని కి ఎక్కడో మండిస్తున్నట్లుగానే ఉన్నాయని అంటున్నారు. అయితే పవన్ చట్ట ప్రకారమే విడాకులు తీసుకున్నారు. ఆయన సమాజం లో ఉన్న చట్టాలనే ఉపయోగించుకున్నారు. అందువల్ల ఈ విషయం లో ఎవరేమి అన్నా పవన్ కానీ జనసేన కానీ పట్టనట్లు ఉండడమే ఉత్తమమని అంటున్నారు.

అలా కాకుండా ఇలాంటి విమర్శల కు ఎంత గట్టిగా గుచ్చుకుంటూంటే రాజకీయాల్లో ప్రత్యర్ధులు అంతే గట్టిగా వాటినే తెచ్చి వడతారు. అందువల్ల రాటు తేలాల్సిందే అని అంటున్నారు. పవన్ అయితే ఈ విషయం లో హర్ట్ అయ్యారనే అంటున్నారు. మరి వైసీపీ ఇంకా దీన్ని వాడుకుంటుందా లేక ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Similar News