పవర్ ఫుల్ స్పీచులు ఇచ్చేస్తుంటారు జనసేనా ని పవన్ కల్యాణ్. అయితే.. ఆయన ప్రసంగాల్లో కంటిన్యూటీ ఉండదు. యాక్షన్ మూవీ లో మధ్య మధ్యలో యాక్షన్ పార్టులు వచ్చేసి.. వెళుతుంటే కిక్కు పెద్దగా ఉండదు. పవన్ కల్యాణ్ ప్రసంగాలు సైతం ఇదే రీతి లో ఉంటాయి. దీనికి తోడు.. అర్థం లేని ఆవేశాన్ని ప్రదర్శిస్తూ.. మనిషి మొత్తం ఊగిపోతూ చేసే ఆయన ప్రసంగాల వీడియో క్లిప్పులు 2019 ఎన్నికల వేళ ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. కాలం కొందరికి కొన్ని పాఠాల్ని నేర్పిస్తుంటుంది. వాటిని గుర్తించి.. తమను తాము మార్చుకొని.. లో పాల్ని సరిదిద్దుకుంటే ఎలా మారతారన్న దానికి నిదర్శనంగా నిలుస్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
వారాహి విజయయాత్ర పేరు తో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటన ను చేపట్టిన పవన్ కల్యాణ్.. తొలుత కత్తిపూడి.. తర్వాత పిఠాపురం.. తాజాగా కాకినాడ లో ఏర్పాటు చేసిన సభల్లో తన వారాహి వాహనం మీద నుంచే ప్రసంగించారు. ఈ మూడు సభల కు జనం ఎంత భారీ గా వచ్చారో అందరికి తెలిసిందే. అయితే.. పదేళ్ల పవన్ రాజకీయ ప్రయాణంలో హై ఓల్టేజ్ స్పీచ్ గా కాకినాడ లో పవన్ చేసిన ప్రసంగమే హైలెట్ అన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. దీంతో. . కాకినాడ లోని సర్పవరం జంక్షన్ లో పవన్ ఏం మాట్లాడారు? ఏమేం వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే.. పవన్ నోటి నుంచి ఏమైతే వచ్చిందో ఆ మాటల్నే తప్పించి.. ఎలాంటి వ్యాఖ్యల్ని జత చేయకుండా అందిస్తున్నాం. గంటా ఇరవై నిమిషాలు మాట్లాడిన పవన్ ప్రసంగం లోని అత్యంత కీలకమైన అంశాల్ని ఆయన మాటల్లోనే చదివితే..
- మన భవిష్యత్తు మన చేతి లోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోవచ్చు. ఇప్పటికే బిహార్ కంటే దారుణ మైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ సామాన్యులు పడుతున్న వేదనలు నిత్యం చూస్తున్నాం. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడ ను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేశారు.
- కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు పరాకాష్ట కు చేరాయి. మరోసారి ఇలాంటి డి గ్యాంగులు గెలిస్తే, పూర్తిగా మన ఇళ్లను కూడా దోచుకునే పరిస్థితి వస్తుంది. కాకినాడ నగర నడిబొడ్డున ఉండి చెబుతున్నాను.. ఈ నగరం ఎమ్మెల్యే డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ని కాకినాడ లో మరోసారి గెలవకుండా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాత కాలం నుంచి ఇలాంటి అరాచకాలే.
- చంద్రశేఖర్ రెడ్డి తాత అక్రమ బియ్యం, దొంగనోట్లు, దౌర్జన్యాల్లాంటివి చేస్తుంటే అప్పట్లో ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చిన ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ అతన్ని నడి రోడ్డు మీద చేతుల కు బేడీలు పోలీసు జీపు వెనుక నడిపించారు. మళ్లీ ఈ డి గ్యాంగు డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ని ఈ భీమ్లానాయక్ కూడా అదే తీరున రోడ్డు పై నడిపేంచే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి.
- అధికార మదం ఎక్కి, తాగిన మైకంలో ఈ ఎమ్మెల్యే నా మీద నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దిగజారి మరీ బూతులు పచ్చిగా తిట్టాడు. నన్ను తిట్టినందుకు కోపం వచ్చి ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు జనసైని కులు, వీర మహిళలు వెళితే ఎమ్మెల్యే అనుచరులు వారి పై దాడులు చేశారు.
- నన్ను తిట్టినందుకు కాదు.. మా వీర మహిళల ను అసభ్యంగా ద్వారంపూడి అనుచరులు దాడి చేసినపుడు నాకు కోపం వచ్చింది. కచ్చితంగా ఈ ఎమ్మెల్యే ను బలంగా ఎదుర్కోవాలని సంకల్పించాను. క్రిమినల్స్ తో నిండిపోయిన వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం కలుగుతుందని 2014 లోనే చెప్పాను. రౌడీయిజం, గుండాయిజం, దోపిడీ, లూటీ, కబ్జా, అవినీతిల కు మూలంగా మారిపోయిన ఈ ప్రభుత్వంలో నేరం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఎదురు తిరుగుతాం. వారిని ప్రశ్నిస్తాం.
- ఒకటి కాదు రెండు కాదు... వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే బియ్యం అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.15 వేలు కోట్లు. గోదావరి జిల్లాలకు అనధికార ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాకినాడలో అక్కడ ఇక్కడ అని కాదు.. కనిపించిన ప్రతి ఆస్తి, అగుపించిన ప్రతి భూమి ప్రజల నుంచి లాగేసుకుంటున్నాడు.
- కాకినాడ కేంద్రంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటా ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం విస్తరించింది. ముఖ్యమంత్రి అండ చూసుకొని చెలరేగిపోతున్న ఈ ఎమ్మెల్యే వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకొని అరాచకం సృష్టిస్తున్నాడు. కచ్చితంగా ప్రతి తప్పుకు ప్రజలకు సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
- కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి దగ్గర 500 మంది క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేని బైకుల పై తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేను కాకినాడ వస్తున్నానని ఒక యువతి వారాహి కి స్వాగతం అని రాస్తే, ఆమెను చంపేస్తామని బెదిరించారు.
- అలాంటి గూండా లకు కాకినాడ నడిబొడ్డు నుంచి చెబుతున్నాను పద్ధతి మార్చుకోండి లేకపోతే జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఒక్కొక్కడిని గుర్తు పెట్టుకొని మరీ రోడ్లపై తన్ని తీసుకెళ్తాం. ద్వారంపూడికి ఒకటే చెబుతున్నాను.. నీ గూండాలు ఆడపిల్లల జోలికి వస్తే మీ తాతకు డీటీ నాయక్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో.. నీకు ఈ బీమ్లా నాయక్ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు.
- నీకు డబ్బు మదం ఎక్కు వై కొట్టుకుంటున్నావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మాది జనసేన పార్టీ కాదు. రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అయితే అందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పేదల కు పంపిణీ చేస్తున్నారు. గతంలో కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఏకంగా 56 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది.
- రేషన్ డీలర్లు, మిల్లర్లు, పేదల వద్ద రేషన్ బియ్యం తీసుకొని అక్రమ రవాణా చేస్తున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా డెకాయిట్ ద్వారంపూడి వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 15 వేల కోట్లు దోచుకున్నాడు.
- తండ్రి పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఇలా కుటుంబం మొత్తం మూకుమ్మడిగా దోచేశారు. ఒకవైపు రైతు కు గిట్టుబాటు ధర లేక కన్నీరు పెడుతుంటే... వారి కన్నీటి పై వీళ్లు సంపాదిస్తున్నారు.
- కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి నాయకులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి అన్నా, ముఖ్యమంత్రి సన్నిహితుడిగా పేరొందిన ద్వారంపూడి అన్నా వైసీపీ సీనియర్ నాయకుల కు భయమే. పవన్ కళ్యాణ్ కు అలాంటి భయాలు లేవు. డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ని, నటోరియస్, ఫ్యాక్షన్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థ లోనే ఎదుర్కొంటాం.
- ఎందెందు వెతికినా అందందు ద్వారంపూడి అక్రమాల లీలలే కనిపిస్తున్నాయి. కాకినాడలో కుంభాభిషేకం ప్రాంతాన్ని, శివాలయాన్ని పోర్టు కోసం అని చెప్పి కబ్జా చేశారు. శివాలయం ముఖ ద్వారం ముందు గోడకట్టేశారు. ద్వారపూడి దగ్గర 500 మంది గుండాలు ఉంటే మనమెంతమందో ఒక్క సారి చూసుకోండి.
- మధ్యతరగతి మేధావుల మౌనం, భయమే క్రిమినల్ రాజ్యమేలాలా చేస్తున్నాయి. మూడు నుంచి 4 శాతం నోటాకు ఓట్లు వేశారు. ఆ ఓట్లు జనసేన కు వేయండి. రౌడీలు, గుండాలను తన్ని తరిమేస్తాం. తన సొంత హెచరీస్ కు సుద్దగెడ్డ దగ్గర వంతెన కట్టుకున్నారు. కొన్నేళ్ల నుంచి కనీసం అక్కడున్న గిరిజనులు వంతెన నిర్మించాలని అడిగినా పట్టించుకోలేదు.
- ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ నుంచి సింహాచలం వరకు చేపట్టిన పాదయాత్ర లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన పరుపులు, వంట పాత్రలు పట్టుకెళ్లిపోయారు. కాకినాడను గంజాయి, డ్రగ్స్ కు అడ్డగా మార్చేశారు. తెలంగాణ, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి వేలకోట్లు దోచుకుంటున్నారు.
- విశాఖ డెయిరీ భూములు కబ్జా చేయాల ని చూస్తున్నారు. సర్వే ముసుగులో చిన్న స్వామినగర్, పెద్ద స్వామినగర్ లో ఖాళీ స్థలాల ను కబ్జా చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్న 30 శాతం పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. పేదోడి ఇళ్ల స్థలాల పేరిట తీరాన్ని కాపాడుతున్న మడ అడవులను నరికేశారు. ఇలా కాకినాడ లో ఈ గూండాల గ్యాంగు చేయని తప్పుడు పని అంటూ ఏదీ లేదు.
- గత ఎన్నికల్లో భీమవరం లో ఓటర్ల లిస్టులో ఉన్న ఓట్లు కంటే 10 వేలు ఎక్కువ ఓట్లు పోలైయ్యాయి. నేను ఎక్కడ నిలబడినా నన్ను ఓడించడానికి రూ.200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. దోపిడీదారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నాతో పాటు నా ఎమ్మెల్యేల ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల పై ఉంది.
- నాతో పాటు సినిమా రంగంలో ఉన్న అందరి హీరోలంటే నాకు అమితమైన అభిమానం. వారి సినిమాలు బాగా ఆడాలని బలంగా కోరుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, చిరంజీవి, రవితేజ ఇలా అందరి హీరో లతో నాకు మంచి సంబంధాలున్నాయి. ఏ హీరో అభిమానులు అయినా సరే నాకు అండగా నిలబడండి.
- సినిమా వినోదం. రాజకీయం జీవితం అనేది తెలుసుకోండి. మనందరి జీవితాల ను శాసించే రాజకీయ నాయకులను ఉన్నత ఆలోచన తో ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతరం తీసుకోవాలి. యువతరం కులాల కు అతీతంగా ఆలోచించాలి. ఫీజు రియంబర్సుమెంటుకు మంగళం పాడిన వ్యక్తి, ఉపాధి దూరం చేసిన వ్యక్తి, ఏడాదికి 2.5 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిన వ్యక్తిని నమ్ముతారో, ఓ బృహత్తరమైన ఆలోచనతో షణ్ముఖ వ్యూహం అమలు చేసి, యువత పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెస్తామని మాటిస్తున్న పవన్ కళ్యాణ్ ను నమ్ముతారో ఆలోచించండి.
- సొంత బాబాయిని క్రూరంగా హత్య చేసి, మొదట గుండెపోటు అని అన్నారు. తర్వాత హత్య అని బయట కు వచ్చాక చాలామందిపై నెపం నెట్టేయడానికి ప్రయత్నించారు. రాజకీయం గానూ వాడుకున్నారు. ఇప్పుడు వైరాలజీ చదువుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీతపై తండ్రి హత్య నింద వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- యూఎస్ లో ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్ సునీత తన తండ్రి హత్య విషయం లో న్యాయం చేయాలని ఎక్కని కోర్టు లేదు... తొక్కని గడప లేదు. చివరకు ఆమెనే నిందితురాలిగా చిత్రీకరించేందుకు సైతం వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
- యువతరం నిజాయతీ గల వ్యక్తుల సమూహాన్ని అసెంబ్లీకి పంపేలా ఆలోచించండి. సభల కు, ర్యాలీల కు వచ్చే సమయంలో కాదు... ఎన్నికల సమయం లో నాకు అండగా నిలబడండి. దమ్ము, ధైర్యం, శౌర్యం, పోరాటం నిజ జీవితంలో చూపండి. అత్యున్నత పదవిని చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా పార్టీ ఎమ్మెల్యేల ను అసెంబ్లీకి పంపి చూడండి. వారి నుంచి ఏ తప్పు జరిగినా నేను స్వయంగా బాధ్యత తీసుకుంటాను. ప్రజల తరఫున నిలబడతాను.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో దిగజారిపోయాయని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇటీవల వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు. ఆయన ఆ మాటలు మాట్లాడం వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. దేశం లోనే ఆడపిల్లల అక్రమ రవాణా, గంజాయి ఎగుమతులు, మట్కా క్లబ్బులు ఇలా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వద్ద ఉన్న కీలక సమాచారం తోనే మాట్లాడారు.
- డీజీపీ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగానే ఉన్నాయని చెబుతున్నారు. అంతా సవ్వంగానే ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం... వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత దాదాపు 33 వేల మంది ఆడపిల్లలు ఎలా మిస్ అయ్యారు..? ఎవరు అపహరిస్తున్నారు? రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా కు కేంద్రం అయింది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో 2వ స్థానంలో ఉంది.
- యువతుల ను వైసీపీ క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కడికి తరలిస్తున్నాయో తెలియదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే 2021లో ఒక యువతి పై ముగ్గురు యువకులు అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు అందులో ప్రసన్న రెడ్డి అనే నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. అదే తాడేపల్లిలో రాణి అనే దళిత అంధ యువతిని యువకుడు నరికి చంపేశాడు.
- ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో 15 ఏళ్ల బాలిక పై 10 మంది అత్యాచారం చేసి గర్భవతిని చేస్తే అధికారులు పట్టించుకోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్లలో ఫార్మసీ విద్యార్థి తేజస్విని అత్యాచారం చేసి చంపేసిన నిందితులను పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు.
- వారం రోజుల కింద నెల్లూరులో 22 ఏళ్ల యువతని హత్య చేశారు. రేపల్లెలో భర్తను కొట్టి ఆడబిడ్డ పై గ్యాంగ్ రేప్ చేస్తే మహిళా హోమంత్రి దొంగతనానికి వచ్చి, అనుకోకుండా రేప్ చేశారనే చెబుతున్నారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం చేసుకోవచ్చు. గతంలో బిహార్ వంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కంటే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి.
- కులాల వారీగా యువతను విడదీస్తేనే వారికి అధికారం. అందుకే యువత లో ఐక్యత ఉండకుండా రకరకాల పన్నాగాలు పన్నుతారు. నేరం చేసిన వాడు ఏ కులమైతే మనకేంటీ? తప్పు తప్పే కదా? నిన్న బాపట్లలో 14 ఏళ్ల బాలుడు తన అక్కను వేధిస్తున్నాడ ని వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని నిలదీస్తే, ఆ వెంకటేశ్వర రెడ్డి ఆ బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టాడు. అప్పుడు కులం ఎందుకు గుర్తుకొస్తుంది?
- తప్పు ఎవరు చేసినా ఒక్కటే. ఆ నేరం చేసిన వాడు మనకులం అనుకోలేం కదా? నేరం చేసిన వాడు ఏ కులమైనా వదిలేది లేదు. రాష్ట్రంలో క్షేమం, భద్రత ఉండాలని బలంగా జనసేన పార్టీ కోరుకుంటుంది. యువతలో భయం పోవాలి. తప్పు చేసిన వారిని ఎదురించే ధైర్యం రావాలి. నేను మంగళగిరి లోనే ఇక అందుబాటు లో ఉంటాను. మీ ప్రతి కష్టంలో తోడుగా నిలబడతాను. మీరు పోరాడే స్ఫూర్తిని అందిపుచ్చుకోండి.
- సినిమా టిక్కెట్ల కోసం గంటల తరబడి క్యూ లో నిలబడే యువతరం పోలింగ్ బూత్ వద్ద నిలబడలేకపోతోంది. మన బతుకుల ను 5 ఏళ్ల పాటు ప్రభావితం చేసే నాయకులను ఎన్నుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకులు ఎదుగుతున్నారు. వారు పెద్దవాళ్లు అవుతున్నారు.
- వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే దళిత డ్రైవర్ ను చంపి, ఇంటికి పార్శిల్ పంపితే దళిత సంఘాల నాయకుల కు కోపం రాదు. 14 ఏళ్ల బీసీ కులానికి చెందిన బాలుడు తన అక్కను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నిస్తే, ఆ బాలుడ్ని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేసినా బీసీ సంఘాల నాయకులకు కోపం ఎందుకు రాదు? ఎందుకు ప్రశ్నించరు.
- రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతల పై గళం ఎందుకు ఎత్తరు? పెట్రోలు పోసి తగులబెట్టిన బాలుడి ప్రాణానికి రూ.లక్ష విలువ కట్టి బేరం ఆడిన బీసీ నాయకుడా మనల్ని పాలించేది? న్యాయం చేయాల్సిన నాయకుడా డబ్బు తీసుకొచ్చి ప్రాణానికి విలువ కట్టేది? ఈ విషయాలన్నీ ప్రజలు ఆలోచించాలి. చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతిన్నాయని బయటకు వచ్చే నాయకులు, సమాజంలో వారివారి కులాలకు చెందిన వారిని హత్య చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదో అర్ధం కాదు.