పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ ఓ విచిత్రమైన మేనరిజం గుర్తొచ్చేస్తుంది. కుడిచేతిని ఎడమ మెడ మీద పెట్టి రబ్ చేసుకునే మేనరిజం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బద్రి’ సినిమాతో మొదలైన ఈ మేనరిజంను పవన్ ఆ తర్వాత ఇంకొన్ని సినిమాల్లో వాడాడు. తర్వాత తర్వాత పవన్ వదిలేసినా.. ఆయన అభిమానులు మాత్రం ఆ మేనరిజంను వదిలిపెట్టలేదు. వేరే హీరోలు.. కమెడియన్లు.. బాల నటులు చాలామంది ఆ మేనరిజంను చాలాసార్లు అనుకరించారు. ఇప్పటికీ అనుకరిస్తూనే ఉన్నారు. ఐతే ఈ మేనరిజం వెనుక కథాకమామిషు ఏంటన్నది పవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బద్రి సినిమాలో ఆ మేనరిజం అనుకోకుండా పెట్టిందే అని పవన్ చెప్పాడు. ఆ సినిమా చేసేటపుడు ఓ ఫంక్షన్లో ఏదో ఫ్రస్టేషన్లో మెడ మీద చేయి పెట్టి అలా రుద్దుకున్నానని.. ఆ తర్వాత ఎవరో అది చూసి ఈ మేనరిజమేదో బాగుందంటే దాన్ని ‘బద్రి’ సినిమాలో పెట్టేశామని.. ఆ తర్వాత అదే ఫ్యాషన్ అయిపోయిందని పవన్ చెప్పాడు. నిజానికి తనకు ఈ మేనరిజం గురించి పెద్దగా పట్టింపు లేదని అన్నాడు. తన ప్రతి సినిమాకూ దర్శకులు ఈ మేనరిజం పెడదామని అడుగుతుంటారని.. ఐతే తాను ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే దాన్ని ట్రై చేసి తర్వాత పక్కనబెట్టేశానని పవన్ చెప్పాడు.
ఇక స్టార్ డమ్ అనేది తాను ఎప్పుడూ అనుభవించలేదని.. దానికి ఎప్పుడూ కనెక్టవ్వలేదని.. ‘స్టార్ డమ్’ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి.. అర్థం కాకపోయేసరికి వదిలేశానని పవన్ చెప్పాడు. సినిమా అనేది సమష్టి కృషి ఫలితమని.. ఇది అందరి వల్లా జరుగుతున్నపుడు.. మొత్తం నాదే అని తాను ఎలా అనుకుంటాన.. కాన్షియస్ గా తనకు తాను అడాప్ట్ చేసుకున్న విధానం ఇదని పవన్ చెప్పాడు.