జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం " సీమాంధ్ర హక్కుల చైతన్య సభ " ప్రారంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇప్పటికే తిరుపతి - కాకినాడ సభల్లో తన ఉద్దేశాన్ని చాటి చెప్పిన పవన్ అనంతపురం సభలో ఏం చెపుతాడు ? అన్న ఆసక్తి సభ ప్రారంభానికి ముందు అందరిలోను నెలకొంది. గత రెండు సభల్లో పవన్ ప్రత్యేక హెదా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ - మోడీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం సభలో పవన్ ప్రత్యేక హోదాతో పాటు పెద్ద నోట్ల రద్దు లాంటి అంశాలపై ఎలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేలాది మంది అభిమానుల సమక్షంలో అనంతపురం పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఈ సభ ప్రారంభమైంది.
- సభ జరిగే మైదానానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి పేరును - వేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేరును పెట్టారు.
- పవన్ ప్రసంగం ప్రారంభం
- పవన్ సభకు వచ్చిన అందరికి నా ధన్యవాదాలు.
- 2014 ఎన్నికల్లో అనంతపురం వచ్చాను.. టీడీపీ - బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశాను.
- సమస్యలు వచ్చినప్పుడు నిలబడే వ్యక్తినే కాని పారిపోయే వ్యక్తిని కాను పోరాటం చేస్తాం నిలబడతాం మడమతిప్పం.
- అనంతపురం జిల్లా ప్రజల ప్రేమానురాగాలంటే నాకు ఎంతో ఇష్టం.
- అనంతపురం కొద్ది రోజుల క్రిందటే వద్దామనుకున్నాను...అయితే ఉగ్రవాదుల దాడుల్లో భారత జవాన్లు చనిపోయారు. ఆ టైంలో హోదా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని కొద్ది రోజులు వాయిదా వేశాను.
- ప్రత్యేక హోదా గురించి మాట్లాడేముందు ఉగ్ర దాడుల్లో చనిపోయిన భారతదేశ జవాన్ల కోసం కొద్ది నిమిషాలు మౌనం పాటిద్దాం.
- భారత్ మాతాకీ జై అంటూ పవన్ నినాదం
- ప్రత్యేక హోదా విషయంలో మనకు చెప్పే విషయంలో కేంద్ర చెప్పే విషయంపై మనకు ఎప్పుడూ క్లారిటీ ఉండదు. అర్థంకాకుండా ఉంటుంది.
- కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో మనకు రావాల్సిందే ఇచ్చారు కాని.. కొత్తగా ఇచ్చిందేం లేదు.
- ఈ ప్యాకేజీ చాలా మంచిదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెపుతోంది.
- ఇవ్వని ప్రత్యేక హోదా కోసం హీరోలు అయిపోయిన వారు ఉన్నారు... హోదా రాకుండానే సన్మానాలు చేయించుకున్న వారు ఉన్నారు.
- ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని అంటున్నారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న మీకు - రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న ఈ అనంతపురం జిల్లాకు ఇది అమృతపు చుక్క. దీనిపై తేలిగ్గా మాట్లాడవద్దు.
- నేను కుటుంబాన్ని పక్కన పెట్టి 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశాను. కానీ ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే వారి ముందు ఉత్త చేతులతో జీ హుజూర్ అంటూ ఆడే బానిసను కాదు నేను.
- మీరు మమ్మలను మాటలతో వంచింది...మోసం చేశారు. ఈ మోసానికి ప్రతీకారంగా ప్రజల సహకారంతో జనసేన నుంచి సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతా.
- తిమ్మమ్మ మర్రిమాను కూడా భూమిలో పడి మొలచి ఎదిగి అనేక శాఖలుగా ఎదిగి మనకు నీడనిచ్చింది. ఆ చెట్టులాగానే నాయకుల మూలాలు కూడా ప్రజల వద్దే ఉన్నాయి. మీరు హోదాకు అనుకూలంగా లేకపోతే కూలదోస్తాం.
- ఇంట్లో ఉన్న ఆలీకి అన్నంపెట్టి ఊరికి ఉపకారం చేసినట్టు కేంద్రం మాట్లాడుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఆంధ్రభోజా ...ఓహో ఆంధ్రభోజా అంటూ చప్పట్లు కొడుతోంది. కొందరు నాయకులు సన్మానాలు చేయించుకుంటున్నారు.
- నరేంద్ర మోడీ అంటే నాకు ఎంతో గౌరవం. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండలేను
- ప్రత్యేక హోదాపై ఆర్థిక రంగ నిపుణులతో చర్చిస్తే వారు అది ఏపీని వంచించడమే అని చెప్పారు. ప్యాకేజీకి చట్ట బద్ధత లేదు. ప్యాకేజీల్లో లెక్కలు అంకెల్లో గారడీ మాత్రమే.
- కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ విమానం పేపర్ విమానం ...దానికి చట్ట బద్ధత లేదు. అది ఆగిపోయిన కాగితపు విమానం.
- 7.50 లక్షల ఎకరాలకు నీరు - 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి - 500 గ్రామాల్లో 28 లక్షల ప్రజలకు తాగునీరు - పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టుకు రూ.16000 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఇందులో కేవలం ఇరిగేషన్‌కు మాత్రమే రూ.8 వేల కోట్లు ఇస్తామని కేంద్రం అంటోంది. అలాంటప్పుడు దానికి జాతీయ ప్రాజెక్టు అని ఎలా పేరు పెట్టారు ? ఇది ఎంత వరకు సమంజసం..?
- పరిశ్రమలకు రాయితీ ఇస్తాం అని చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. పరిశ్రమలు స్థాపించి ఉత్తత్తి ప్రారంభమయ్యేందుకు ఇంకెన్ని సంవత్సరాలు పట్టాలి. ఆ తర్వాత కేంద్రం పరిశ్రమలు మేం ఇచ్చినా రాష్ట్రం ఉపయోగించుకోలేదని వంచింస్తుంది.
- ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పండి...దయచేసి మా హృదయాలను కఠినంగా చేయవద్దు.
- అనంతపురం జిల్లాకు సెంట్రల్ వర్సిటీ వస్తామని పదే పదే చెపుతున్నారు. ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లాడికి మనవడు పుట్టినప్పుడు మీరు అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తారా ?
- మీ మాటలు విని విని విని అలసిపోయాం.... దయచేసి మా ప్రాణాలతో ..మా అభిమానంతో మీరు ఆడుకోకండి.
- కేంద్ర ప్రభుత్వ తీరుతో నాకు సైట్ వచ్చింది... నా కళ్లజోడుకు కేంద్రం గ్రాంటు జారీ చేయాలి. కేంద్రం ప్యాకేజీ విషయంలో సామాన్యులకు అర్థం కాని భాషను వాడింది.... దీని గురించి తెలుసుకునేందుకు ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల నాకు కళ్లు కూడా సరిగా కనపడలేదు.
- ఏపీకి కొత్త ఎయిర్ పోర్టుల విషయంలో కేంద్రం - రాష్ట్రం దోబూచులాడుతున్నాయి. ఈ విషయం పిచ్చి కుదిరితేనే పెళ్లి... పెళ్లి కుదిరితేనే పిచ్చి అన్నట్టుగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది.
- రాయలసీమకు రాసుకునేందుకు పేజీల పేజీల చరిత్ర ఉంది..కానీ తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. అలాగే పంట తడిపేందుకు చుక్క నీళ్లు లేవు.
- నేను చదువుకునేటప్పుడు తాకట్టులో భారతదేశం అనే పుస్తకం చదువుకున్నాను. మన వనరులు మనకు ఉపయోగపడ్డాకే ఇతరులకు ఉపయోగపడాలి. కాని ఇందుకు భిన్నంగా మన కష్టం మన జాతీ సంపద బయట వాళ్లకు ఇచ్చేసి ఉచితంగా ..ఆ తర్వాత డబ్బుపెట్టి కొనుక్కొంటున్నాం.
- నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే ప్రారంభిస్తున్నా.
- 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను... గెలుస్తానా..? ఓడుతానా ? అన్నది ఆ తర్వాత విషయం. మీరు నాకు అండగా ఉంటారా ? లేదో తెలియదు గాని..నేను మాత్రం మీకు ఎల్లప్పుడు అండగా ఉంటాను.
- అనంత జిల్లా కోసం దివంగత ఫెరీరా, బెంగాల్‌లో పుట్టి ఇక్కడ రొద్దం మండలంలో ఉండి విపత్తు ప్రాజెక్టును ప్రారంభించిన మేరి జాన్ అండ్ గంగూలియన్ లాంటి వాళ్లు పోరాటం చేస్తున్నారు ? కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడి రైతులకు ఏం చేస్తున్నాయి.
- ఎన్నో లోపాలు ఉన్న ప్రత్యేక హోదాను టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది ? మనకు రావాల్సినవి మాత్రమే మనకు వచ్చినప్పుడు దానిని చంద్రబాబు గారు ఎలా మెచ్చుకున్నారు ? దీనిపై టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి.
- నేను సభలలో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అయితే జనసేనది విధానపరమైన పోరాటమే తప్ప, వ్యక్తులపై పోరాటం చేయదు. చంద్రబాబు గారు, వైఎఎస్.జగన్మోహన్‌రెడ్డి గార్ల పాలసీ మీదే పోరాటం చేస్తానే తప్ప వారిపై వ్యక్తిగత వైరుధ్యం లేదు. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మాయమాటలు చెప్పి తప్పించుకుంటే మాత్రం నేను మీకు చాలా బలమైన శత్రువును. నాకు ప్రజల సమస్యల పరిష్కారం కావాలి. దశాబ్దాలుగా అలసిపోయాం. ఇంకెంత కాలం ఈ పోరాటం చేయాలి.
- రాజకీయాలు అంటే కల్లూరి - తరిమెల నాగిరెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అనవసరమైన రాజకీయ విమర్శలు జనసేన చేయదు.
- 1972లో ఓ జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకు మనం ఇప్పటకీ పన్నులు కడుతున్నాం. చంద్రబాబు అయినా జగన్ అయినా తప్పులు సరి చేసుకోకపోతే భావి తరాలు దెబ్బతింటాయి. మీరు ఆ తప్పులు సరి చేసుకోకపోతే పవన్ జనసేన పోరాటం ఆగదు. ఆడ బిడ్డల మానసంరక్షణకు నేను ముందుంటాను.
- నేనెప్పుడు జై జవాన్ - జై కిసాన్ ను నమ్ముతాను. జనసేన రైతుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తుంది.
- నేను నా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశాను. టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన కరప్షన్ ఎక్కువైందని ప్రజలు చర్చించుకుంటున్నారు ? ఇలాంటి ఆరోపణలు టీడీపీ ప్రభుత్వంపై ఎందుకు వస్తున్నాయి ? దీనిపై టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
- రాయలసీమ, ఉత్తరాంధ్రలో వేర్పాటు ఉద్యమాల ఆలోచనలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ వెనకపడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే మళ్లీ తెలంగాణలా వేర్పాటు వాద ఉద్యమాలు రావొచ్చు. రాయలసీమ అభివృద్ధి కోసం
జనసేన పాలసీ మేకర్స్‌తో చర్చిస్తున్నాను.
- అనంతపురం జిల్లాకు కనీసం 100 టీఎంసీల నీరు కావాలి...కానీ వీళ్లక కనీసం 30 టీఎంసీల నీరు కూడా రావడం లేదు.
- సినిమాల్లో పోరాటం చాలా తేలిక...ఓ విలన్ మీద రెండున్నర గంటలు పోరాటం చేస్తే చాలు. కానీ నిజ జీవితంలో సమస్యల మీద పోరాటం చేయడం చాలా కష్టం. జనసేన మీ తరపున ఎప్పుడూ పోరాడుతుంది.
- పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని ఉన్నత కులాల వారే ఉంటున్నారు. కాని పారిశ్రామికంగా దళితులతో పాటు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలి.
- సీఎం చంద్రబాబు గారు సింగపూర్ తరహా రాజధాని అంటుంటారు... లీక్ వాన్ యూ సింగపూర్‌ను 25 సంవత్సరాలు పాలించారు. సింగపూర్ అంటే ఎత్తైన కష్టడాలు కాదు...సింగపూర్ అంటే కరప్షన్ లేదు. తన సొంత స్నేహితుడు కరప్షన్ చేస్తే లీక్ వాన్ యూ జైళ్లో పెట్టించారు. ఎత్తైన కట్టడాలు, విశాలమైన రోడ్లు వేస్తే సింగపూర్ అయిపోదు. సింగపూర్ లాంటి అవినీతి రహిత సమాజం మనకు కావాలి.
- ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువెళతాను. ఇందుకోసం మోడీ అపాయింట్ మెంట్‌ను అడిగాను..
మోడీ అపాయింట్‌మెంట్ ఇంకా రాలేదు.
- అనంతపురం కరువు కోసం టీడీపీ - వైకాపా అందరం ఒక్కమాట మీదే ఉండాలి. అనంతపురంకు 100 టీఎంసీలు నీళ్లు ఎలా వస్తాయో ? అనంతపురంను దుర్భిక్షం నుంచి ఎలా బయటకు తేవాలో అన్ని రాజకీయ పక్షాలు ఆలోచించుకోవాలి. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాలి.
- రాజకీయ నాయకుల్లో కరప్షన్ పోవాలన్నదే నా సిద్ధాంతం. తరిమెల నాగిరెడ్డి, కల్లూరి, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి నేను జనసేన ప్రారంభించాను. వీరి బాటలోనే అవినీతి రహిత రాజకీయ సమాజాన్ని స్థాపించాలన్నదే నా లక్ష్యం.
- ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు లక్షల మూడువేల కోట్లు ఇస్తున్నామంటే...మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రెండులక్షల ఇరవైఅయిదు వేల కోట్లు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రుల మాటల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ తేడాలోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది. వారి మాటల్లో స్పష్టత లేదు.
Full View