పవన్ కళ్యాణ్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించని వారితో పొత్తు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలం లేని బీఎస్పీతో పొత్తుకు ట్రై చేశారు. ఈ అనూహ్య నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకొని ముందుకు వెళతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ పవన్ శుక్రవారం తీసుకున్న అనూహ్యం నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది.
దేశంలో లోక్ సభ ఎన్నికలు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం హఠాత్తుగా పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లారు. బీఎస్పీ అధినేత్రి మాయవతిని కలుసుకున్నారు. ఈ భేటి అనంతరం మాయవతి - పవన్ మీడియాతో మాట్లాడారు.ఇద్దరూ ఈ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించారు.
ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో బీఎస్పీకి కేడర్ ఉందని.. ఈ నేపథ్యంలోనే కలిసి పోటీచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు మాయవతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనతో కలిసి ముందుకు వెళతామని మాయావతి పేర్కొన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సైతం మీడియాతో మాట్లాడారు. మాయవతిని దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నానని తెలిపారు. ఆమె ఈ దేశానికి ప్రధాని కావడానికి అన్ని విధాలా అర్హులన్నారు. అలాంటి ఆమెతో పొత్తు పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ తీసుకున్న ఈ అనూహ్యం నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.