ప‌వ‌న్ స‌మ‌ర్పించు జ‌న‌సేన ఫిలిం ఇన్ స్టిట్యూట్‌!

Update: 2019-06-30 09:48 GMT
ఊహించ‌ని రీతిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఆరేళ్ల క్రితం జ‌న‌సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకోవ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు పార్టీ అధినేత ప‌వ‌న్ సైతం ఓట‌మిపాలు కావ‌టం ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేని ప‌రిస్థితి.

అయితే.. ఎన్నిక‌ల వేళ ఓటుకు పైసా కూడా ఇవ్వ‌కుండా స‌రికొత్త త‌ర‌హా రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎన్నిక‌ల అనంత‌రం రివ్యూలను నిర్వ‌హించారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీ రాజ‌కీయాల్లో చేసేదేమీ లేద‌ని భావించారో కానీ.. జ‌న‌సేన నేతృత్వంలో పాల‌కొల్లులో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ప్రారంభించనున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించటం ఆస‌క్తిక‌రంగా మారింది.

అల్లు రామ‌లింగ‌య్య‌..దాస‌రి నారాయ‌ణ‌.. కోడి రామ‌కృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘ‌న‌త పాల‌కొల్లుకు ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు.  ఈ ఇన్ స్టిట్యూట్ ను రాజా వ‌న్నెంరెడ్డి.. బ‌న్నీ వాసులు నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ కి హ‌రిరామ‌జోగ‌య్య ఛైర్మ‌న్ గా.. రాజా వ‌న్నెంరెడ్డి ప్రిన్సిప‌ల్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతున్నారు. నట‌న‌.. ద‌ర్శ‌క‌త్వంతో పాటు ప‌లు విభాగాల్లో శిక్ష‌ణ ఇచ్చేందుకు ఇన్ స్టిట్యూట్ సిద్ధంగా ఉంద‌ట‌. రాజ‌కీయాలు చేయాల్సిన జ‌న‌సేన ఈ కొత్త అవ‌తారం ఏమిట‌న్న‌ది ఇప్పుడు  ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News