జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిమానులకు కీలక క్లారిటీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సభలో పవన్ మాట్లాడుతూ పార్టీ గుర్తును పిడికిలిగా నిర్ణయించినట్లు వెల్లడించారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందన్నారు. అన్ని కులాలు - మతాలు - ప్రాంతాలు కలసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామని - అందుకే ఈ గుర్తును ఇదే ఎంపిక చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అయితే, పవన్ ఈ ప్రకటన చేయడానికి ముందు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ చోటుచేసుకుంది. జనసేన పార్టీ గుర్తు ``పిడికిలి``అంటూ పలువురు పవన్ అభిమానులు పోస్ట్ చేశారు. అయితే, దీనిపై జనసేన క్లారిటీ ఇచ్చింది. ``జనసేన ఎన్నికల గుర్తు ఇంకా రాలేదు అని గుర్తించాలి. పార్టీ గుర్తు వేరు ఎన్నికల గుర్తు వేరుగా ఉంటాయి. సోషల్ మీడియాలో వస్తున్న జనసేన పార్టీ గుర్తు "పిడికిలి" కాదు. పవన్ కళ్యాణ్ అన్నీ మతాలకు,కులాల ఐక్యతగా జనసేనపార్టీ ఉందని అన్నీ చేతివేళ్ళు కలిస్తే పిడికిలి అనే రూపంలో ఆయన చెప్పారు.జనసేన యొక్క అధికారిగా గుర్తును ఎన్నికల కమిషన్ వారు నిర్ణయిస్తారు.దయచేసి ఈ అసత్యప్రచారాలు నమ్మొద్దు`` అని జనసేన పార్టీ తరఫున వివరించారు. తణుకులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పిడికిలి గుర్తు ఎందుకు వాడుతుంది అంటే సమిష్టి కృషి, అన్ని వర్గాలు కలిసి పోరాటాలు చేస్తేనే అభివృద్ధి సాధ్యం అనేందుకు చిహ్నమే పిడికిలి అంటూ వివరణ ఇచ్చారు.