జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రెండు రాష్ర్టాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు - పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలను నియమించడం - పార్టీ శ్రేణులను ఎంపిక చేయడం - ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం ప్రకటించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు.
ఇటీవలే ఏపీలో పర్యటించిన పవన్ పలు ప్రజా సమస్యలపై గళం విప్పిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా తమిళనాడు నేతలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పవన్ సూచించారు. తాజాగా విశాఖలో దళిత మహిళపై జరిగిన దుశ్చర్యను పవన్ ఖండించారు. ఇలా ప్రజా సమస్యల విషయంలో పార్టీ తరఫున చురుకుగా స్పందిస్తున్న పవన్ తాజాగా ట్విట్టర్ వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏడు ప్రధాన అంశాలను తమ సిద్దాంతంలో భాగంగా పవన్ వెల్లడించారు.
ఇవి పవన్ కళ్యాణ్ వెల్లడించిన “జనసేన” సిద్ధాంతాలు
కులాలని కలిపే ఆలోచన విధానం
మతాల ప్రస్తావన లేని రాజకీయం
భాషల్ని గౌరవించే సాంప్రదాయం
సంస్కృతులుని కాపాడే సమాజం
ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం
ఇవి దేశపటిష్టతకు మూలాలు