పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక హోదా సాధన సమితి నేత - నటుడు శివాజీ ఆసక్తికర కామెంట్ చేశారు. మొన్నామధ్య వరకు ప్రత్యేక హోదా తప్ప ఏపీకి ఏమిచ్చినా నష్టమేనని, ప్యాకేజీ తీసుకునేందుకు చంద్రబాబు సహా విపక్ష వైకాపాలు సిద్ధమయ్యాయని ఆరోపించిన శివాజీ.. తర్వాత కృష్ణా పుష్కరాల్లో హోదాను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పిండ ప్రదానం కూడా చేశారు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీపై ఢిల్లీలో కేంద్రం మంత్రి - టీడీపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన ప్రకటనపైనా ఆయన మీడియాలో విరుచుకుపడ్డారు. సుజనా ఎవరండీ ప్యాకేజీ గురించి మాట్లాడడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్యాకేజీకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు ఇష్టపడితే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా హెచ్చరించిన శివాజీ.. తన శవం సీఎం ఇంటిముందు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. అయితే, ప్యాకేజీ వచ్చి రెండు రోజులు గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకు మీడియా ముందుకు రాని శివాజీ.. తాజాగా శనివారం ఏపీలో ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న బంద్ లో పాల్గొన్నారు. సీపీఐ విజయవాడ కార్యాలయం నుంచి చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో పవన్ తలుచుకుంటే కేవలం ఒకే ఒక్కవారంలో హోదా వచ్చి తీరుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ తన శక్తిని కరెక్ట్ గా వినియోగించుకోవాలని అన్నారు. ప్రస్తుతం పవన్ తప్ప ఇంకెవ్వరూ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే అవకాశం కనిపించడం లేదని చెప్పారు. మరి శివాజీ వ్యాఖ్యలపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఏదేమైనా.. ప్రత్యేక హోదా కోసం శివాజీ పడుతున్న తాపత్రయం మాత్రం విశేషంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన అటు బీజేపీని - ఇటు టీడీపీని - వైకాపాని దేన్నీ వదలకుండా ఉతికి ఆరేస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి పవన్ కనుక హోదా కోసం పిలుపు ఇస్తే.. శివాజీ పాల్గొంటారో లేదో చూడాలి.