అవినీతిపై యుద్ధం చేస్తానని.. అందుకోసం ఎంతకైనా వెళతానంటూ రోజుల కొద్దీ ప్రసంగాలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు దారుణ పరిస్థితి ఎదురైంది. నిన్నటి వరకూ మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ సర్కారు మారిందన్న తీవ్ర వ్యాఖ్యలు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి.
పవన్ వ్యాఖ్యలు చంద్రబాబును ఎంతలా బాధించాయన్న దానికి సాక్ష్యంగా బాబు వెర్షన్ కూడా అచ్చు కావటం.. కొన్ని పత్రికల్లో అయితే.. పవన్ సభకు దగ్గర దగ్గరగా బాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. అన్నింటికి మించి బాబుకు ఊపిరాడని పరిస్థితి తన మీదా.. తన ప్రభుత్వం మీద పవన్ చేసిన ఆరోపణల కంటే కూడా.. తన కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ మీద ఆయన సంధించిన ఆరోపణాస్త్రం బాగా బాధ పెట్టిందని చెప్పాలి.
తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దుతున్న బాబుకు.. పవన్ వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయని చెప్పాలి. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండే నాయకుడి మీద.. భవిష్యత్ పాలకుడ్ని కావాలని కలలు కనే నేతపై పడే మరక.. అందులోకి పవన్ లాంటి నేత నోటి నుంచి మాట రావటం అంటే.. అది చిన్న విషయం కాదు.
తాను జాగ్రత్తగా మాట్లాడతానని.. ఆచితూచి తన మాటలు ఉంటాయని.. బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పే పవన్.. లోకేశ్ కు సంబంధించిన బలమైన ఆధారం.. సాక్ష్యం లేకుండా తొందరపడి మాట్లాడే అవకాశం ఉంటుందా? అన్నది సందేహంగా మారింది.
లోకేశ్‌కు సంబంధించి పక్కా ఆధారం.. లేదంటే లింకు ఉండి ఉంటుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ మీద ఆరోపణలు చేసిన సందర్భంలో పవన్ మాటల్ని గమనిస్తే.. మీ అబ్బాయి అవినీతి గురించి మీకు తెలుసా? అన్న డౌట్ ను ఎక్స్ ప్రెస్ చేయటం మర్చిపోకూడదు. చినబాబును టార్గెట్ చేసిన సమయంలో చంద్రబాబును నిందించకుండా జాగ్రత్త పడటం పవన్ వ్యూహంలో భాగమై ఉంటుంది. ఇలాంటి వేళ.. త్వరపడి తన కొడుక్కి క్లీన్ చిట్ ఇచ్చేసే బదులు.. కాస్త ఓపిక పడితే మంచిదన్న మాట వినిపిస్తోంది. చినబాబును టార్గెట్ చేయటం వెనుక పవన్ లక్ష్యం ఏమిటి? ఉత్తినే మాట అనేశారా? పవన్ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా? శేఖర్ రెడ్డి ప్రస్తావన తెచ్చిన పవన్.. అందుకు ఆధారంగా ఏం ఉండి ఉంటాయన్న విషయంపై మధనం చేయాల్సిన అవసరం ఉంది.
కానీ.. బాబు కానీ ఆయన అనుచర వర్గం కానీ ఈ విషయంపై ఆచితూచి స్పందించే కంటే.. ఆవేశాన్నే ప్రదర్శిస్తున్నారు. పవన్ సంధించిన అస్త్రం తమ భావినేత అని.. భవిష్యత్ నాయకుడి మీదనని.. ఇలాంటప్పుడు క్రాస్ చెక్ చేసుకొని.. ఎలాంటి తప్పు లేదన్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిదని చెబుతున్నారు. ఆవేశంతో వెనుకా ముందు చూసుకోకుండా తమ చినబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత కానీ.. ఏదైనా ఆధారం బయటకు తెస్తే.. లోకేశ్ తో పాటు.. ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన బాబు కూడా ఇరుకున పడతారని చెప్పక తప్పదు. అయినా.. కొడుకు మీద ఆరోపణలు చేస్తే.. తండ్రి స్పందించే కన్నా పార్టీ రియాక్ట్ కావటం బాగుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా తెలుగు తమ్ముళ్ల వేస్తున్న అడుగులు లోకేశ్‌కు లేనిపోని చిక్కులు తెచ్చి పెడతాయన్నది చెక్ చేసుకుంటే మంచిదని చెప్పక తప్పదు.