ఎపుడూ పవన్ కళ్యాణ్ తో ఉండే అలీ వైసీపీలో చేరినపుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ - అలీ బాగా దగ్గర కదా.. ఇతను వైసీపీలో చేరాడేంటి అని చర్చ నడిచింది. అయితే, ఆ విషయంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు. అలీకి కష్టాల్లో అండగా నిలిచాను. కానీ నాకు అవసరం అయినపుడు అలీ తన స్వార్థం చూసుకున్నాడు. నాతో కలిసి పనిచేస్తానని చెప్పి ఇంకో పార్టీలో చేరాడు. ఇంకో పార్టీలోకి వెళ్లడం తప్పు కాదు... అలాంటి ఉద్దేశం ఉన్నపుడు నాకు వస్తానని చెప్పడం ఎందుకు అని రాజమండ్రిలో రోడ్ షో లో పవన్ ప్రశ్నించారు.
అలీ వంటి వాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతోంది. అందుకే మనుషులని నమ్మడం కంటే సమాజం నమ్మడం మేలు. స్నేహంలో - బంధువుల్లో ఇలాంటి వాళ్లు ఉన్నపుడు వీరి కంటే ప్రజలు మేలు. వారు నమ్మితో అండగా ఉంటారు. ఇలా మోసం చేయరు. అలీ వంటి వారే వదిలేసి వెళ్లిపోతే... ఇంకెవరిని నమ్మాలని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రజలకు తప్ప బంధువులను కూడా నమ్మలేక పోతున్నానని చెప్పారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని... ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో అలీ చేరాడని చెప్పారు.