నటిస్తున్నారో.. జీవిస్తున్నారో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తాజాగా టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు - ఆయన తనయుడు.. ఏపీ మంత్రి అయిన లోకేశ్ లపై మునుపెన్నడూ లేనిస్థాయిలో ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై పవన్ మండిపడ్డారు. కంచె చేను మేస్తున్నట్టుగా చంద్రబాబు పాలన సాగుతోందని పవన్ ఫైర్ అయ్యారు.
పవన్ ఇంతకుముందెన్నడూ లేనట్లుగా ఈసారి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ కు మనవడిగా పుట్టిన నారా లోకేష్ హద్దులు దాటి అవినీతికి పాల్పడుతున్నారని పవన్ ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ను అవినీతిప్రదేశ్‌గా మార్చేశారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందే సంపాదించుకుంటున్నామని నిస్సిగ్గుగా టీడీపీ నేతలు చెప్పడం కంటే దారుణం ఏముందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఫాతిమా కాలేజ్ విద్యార్థుల ఉదంతమే మంచి ఉదాహరణ అని పవన్ చెప్పారు.
చంద్రబాబుకు బాధ్యత లేదని పవన్ పరోక్షంగా విమర్శించారు. తాను ఒక ముఖ్యమంత్రికి అల్లుడిని కాదు.. ఒక ముఖ్యమంత్రికి కొడుకును కాదని పవన్ వ్యాఖ్యానించారు. అందుకే తాను బాధ్యతగా మాట్లాడుతుంటానని చెప్పారు. ఇలా ఉంటారని తెలిస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ- బీజేపీకి తాను మద్దతు ఇచ్చేవాడిని కాదన్నారు. ఎక్కి తొక్కించుకోవడానికా మేం మద్దతు ఇచ్చింది అని ప్రశ్నించారు. మీతో మీ పిల్లలతో కూడా మేం ఎక్కితొక్కించుకోవాలా అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు నాలుగేళ్లలో మూడు మాటలు మాట్లాడితే .. ఆరు అబద్దాలు వినిపిస్తున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. మూడు మాటలు.. ఆరు అబద్దాలు అన్నట్టుగా టీడీపీ పాలన సాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణం కోసం టీడీపీకి మద్దతు ఇచ్చాను గానీ.. తెలుగు దేశం పార్టీ పునర్ నిర్మాణం కోసం మాత్రం కానేకాదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే.. రాజధాని నిర్మాణానికి 2000 ఎకరాలు ఉంటే అద్బుతంగా రాజధాని కట్టవచ్చన్నారు. కానీ ఇప్పుడు లక్ష ఎకరాల వరకు దాన్ని విస్తరించేశారు. అభివృద్ధి కొందరికేనా…. అందరికీ కాదా అనిపిస్తోందన్నారు. అందరికీ అభివృద్ధి అన్న ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తనకు అనిపించడం లేదన్నారు. 15 లక్షల ఎంవోయూలు చేశామంటున్నారు… కానీ ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.ప్రత్యేక హోదా విషయంలో అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతున్నారన్నారు.
పనిలో పనిగా వైసీపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు పోరాటం మానేశారని.. అసెంబ్లీకి కూడా రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా? అని ప్రశ్నించారు. పంచాయతీ - మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన సత్తా ఏంటో చూపిస్తామన్నారు పవన్ కల్యాణ్. జనం కోసం తాను చనిపోవడానికి సిద్దంగా ఉన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. గుంటూరులో కలరా వచ్చి మనుషులు చచ్చిపోయినప్పుడు రాని భావోద్వేగం.. అమరావతిని నిర్మించలేక పోతున్నందుకు చంద్రబాబుకు వస్తోందని పవన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం తాను బలిదానానికి సిద్ధమని.. ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధమన్నారు.