కొద్దికాలం క్రితం వరకు ఒకే పడవలో ప్రయణించి ఇటీవలే దూరమైన తెలుగుదేశం - జనసేనల మధ్య సోషల్ వార్ మొదలైంది. తమకు పక్కలో బల్లెం వలే మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ ఎపిసోడ్ లో మరో అడుగు ముందుకు వేసి పవన్ తరహాలోనే ట్వీట్టర్ లో ‘సోషల్ వార్’ స్టార్ట్ చేశారు. ‘జగన్-పవన్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం ప్రశాంత్ కిషోర్. మోడీ-అమిత్ షా నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం మీ ముందుకు రాబోతోంది’ అని ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. అయితే దీనికి జనసేనాని సైతం కౌంటర్ ఇచ్చింది.
సహజంగా జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని ప్రెస్ నోట్ రూపంలో మీడియాకు విడుదల చేస్తుంది. అదే విధంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అయితే టీడీపీ నేతలపై సోషల్ వార్ పై తాము సైతం ఇదే రీతిలో రియాక్ట్ అవ్వాలని పవన్ సైన్యం డిసైడ్ అయినట్లుంది. అందుకే కేవలం ట్విట్టర్ లో మాత్రమే ఎంపీ గల్లా జయదేవ్ కు కౌంటర్ ఇచ్చింది. తన ప్రెస్ నోట్ ను జనసేన అకౌంట్లో పోస్ట్ చేసింది. `వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్ పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ ఎదురుదాడి చేసింది. ఇటు విలేకరుల సమావేశాల్లో, అటు టీవీ చర్చల్లో పచ్చ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోసుకుంటున్న దానికి తాజాగా సోషల్ మీడియా వార్ మరో మలుపు తీసుకుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.