అమెరికాలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను ఆపేసిన ‘సత్యగ్రహి’ సినిమా గురించి పలు ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు. యూఎస్ లోని ఎన్నారైలతో కలిసి ప్రవాసాంధ్ర గర్జన అనే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జన సేన పార్టీ విరాళాల సేకరణకు రాలేదని.. తనకు విరాళాలు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. అదే విధంగా డల్లాస్ లో నిర్వహించిన సభలో నాందేండ్ల మనోహర్ తో కలిసి మాట్లాడారు.
చాలా సంవత్సరాల క్రితం సత్యగ్రహి అనే సినిమా స్టార్ట్ చేసి ఆపేశాను. ప్రస్తుతం నేను నా నిజ జీవితంలో ఏం చేస్తున్నానో అదే సత్యగ్రహి సినిమా కథ. సినిమాల్లో పోరాటం చేస్తే పనులు జరగడం కష్టమని- నిజ జీవితంలో నేను పోరాటం చేయడానికి సిద్ధపడే సత్యగ్రహి సినిమాను ఆపేసినట్టు తెలిపారు.
ఆ సినిమాను ఆపేసినప్పుడు చాలామంది తనను తిట్టారు. సత్యగ్రహి సినిమా పోస్టర్లో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఫొటో ను, చేగువేరా ఫొటోను పెట్టాను. సినిమాలతో పోరాటం చేయడం ఇష్టంలేకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు.
యువతలో కొంతమంది సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ కోసం శ్రమిస్తారు. కానీ నేను ధైర్యం అనే బలం కోసం పని చేస్తాను.. కండల పెంచడం ఈజీ.. కానీ గుండె ధైర్యాన్ని పెంచాలంటే పిరికి తనాన్ని జయించాలని యువతకు పవన్ కళ్యాణ్ సూచించారు. రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే చాలా గుండె ధైర్యం కావాలన్నారు. భవిష్యత్ పై భయం ఉండటం సహజమని- ప్రజా సమస్యలను తీర్చడానికి ధైర్యం అనే ఆయుధంతో పోరాడాలని పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి అన్నారు.